Posted on 2024-08-10 11:49:48
డైలీ భారత్, ఖానాపూర్: ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది నిర్వాకం.. రోగుల పాలిట శాపంగా మారుతోంది. కాలం చెల్లిన మందులు, ఇంజెక్షన్లు, సెలైన్ బాటిళ్లను ఇష్టానుసారం వినియోగిస్తుండడం.. రోగుల ప్రాణం మీదకు వస్తోంది. తాజాగా నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం ఇలాంటి ఉదంతమే చోటు చేసుకుంది. కడెం మండలం లింగాపూర్‌కు చెందిన అజారుద్దీన్ జ్వరంతో బాధపడుతూ ఖానాపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరగా.. పరీక్షించిన వైద్యులు అతడికి సెలైన్ బాటిల్‌ను ఎక్కించాలని సిబ్బందికి సూచించారు. దీంతో ఆస్పత్రిలో ఉన్న ఓ బాటిల్‌ను తీసుకొచ్చిన సిబ్బంది.. అతడికి ఎక్కించడం ప్రారంభించారు.
కానీ, కాసేపటికే అజారుద్దీన్ మరింత అస్వస్థతకు గురయ్యాడు. ఇది గమనించిన అతడి సోదరుడు ఆ బాటిల్‌ను పరిశీలించగా.. 2024 మార్చి నెల వరకే దాని కాలపరిమితి ఉన్నట్లు కనిపించింది. ఈ విషయాన్ని వెంటనే ఆస్పత్రి సిబ్బంది దృష్టికి తీసుకెళ్లగా.. దాన్ని తొలగించి మరొకటి పెట్టారు. ఈ ఘటనలో బాధిత యువకుడికి ఎటువంటి అపాయం కలగకపోయినా.. కొంత మేర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో సిబ్బందిపై రోగి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం బయటకు పొక్కడంతో పలువురు విలేకరులు ఆస్పత్రికి వెళ్లారు. ఈ క్రమంలో అక్కడి టేబుల్‌ను పరిశీలించగా... కాలం చెల్లిన మరిన్ని ఇంజక్షన్లు దర్శనమిచ్చాయి.
వాస్తవానికి నిర్ణీత గడువుకు మూడు నెలల ముందే ఆయా మందులను ప్రత్యేకంగా ఒక బాక్స్‌లో వేసి, నెల రోజుల ముందు వరకు మాత్రమే ఉపయోగిస్తారు. కానీ, ఖానాపూర్ ఆస్పత్రిలో అలాంటి నిబంధనలేమీ పాటిస్తున్న దాఖలాలు కనిపించలేదు. ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ వంశీమాధవ్‌ను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా కాలం చెల్లిన మందులను ఎప్పటికప్పుడు తొలగించాలని సిబ్బందికి సూచిస్తామని చెప్పారు. పని భారం వల్ల మందులను తొలగించడంలో జాప్యం జరిగిందని తెలిపారు. ఈ నిర్లక్ష్యానికి కారణమైన వారిని గుర్తించి ఉన్నతాధికారులకు వివరాలు అందజేస్తామన్నారు. గడువు ముగిసిన సెలైన్ బాటిల్ ఎక్కించిన అజారుద్దీన్‌కు ఎటువంటి ఇబ్బందీ లేదని, అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-27 10:56:55
Readmore >