| Daily భారత్
Logo




రాష్ర్టంలో కాంగ్రెస్ పేదల పార్టీ : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

News

Posted on 2024-08-09 15:32:11

Share: Share


రాష్ర్టంలో కాంగ్రెస్ పేదల పార్టీ : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

ప్రతిపక్షాల కాకి గోల పట్టించుకొం..!

షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

కళ్యాణ లక్ష్మి, షాది ముబారాక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కొందర్గు ఉమ్మడి మండలంలో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: గత ప్రభుత్వంలో దోచుకుని దాచుకున్నోల్ల కాకి గోల పట్టించుకోమని, పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు. ఉమ్మడి కొందర్గు మండలంలోని జిల్లెడ్ -చౌదరి గూడెం మండల పర్యటనలో భాగంగా మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద మంజూరైన 21 కళ్యాణ లక్ష్మి చెక్కులను (మొత్తం రూ" 21,02,436) పంపిణీ చేశారు.

అదేవిధంగా కొందుర్గులో 33 చెక్కులను 54 మందికి ఎమ్మెల్యే వీళ్ళపల్లి శంకర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం కార్యక్రమాలలో ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ.. కష్టాల్లో ఉన్న పేదవారి కోసం పనిచేసి వారి  కష్టాలను తీర్చాలని అలాగే పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేయుటకు అందరూ సమిష్టి కృషి చేయాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి కానీ మనం చేసిన మంచి పనులే ఎప్పటికీ గుర్తు ఉంటాయని తెలిపారు. గత పది సంవత్సరాలుగా సాధ్యం కానీ రుణమాఫీ అమలు కార్యక్రమం మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల లోపే 30 వేల కోట్లను సమకూర్చి రుణమాఫీ అమలు చేశామని ఎమ్మెల్యే తెలిపారు. అసాధ్యం అనుకున్న రుణమాఫీ అమలును సుసాధ్య చేసుకున్నామని పేర్కొన్నారు. మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించి దూర ప్రయాణం చేయుటకు వ్యయ ప్రయాసాలు చేయాల్సిన అవసరం లేకుండా చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని తెలిపారు. చౌదరిగూడ మండలంలో కొత్తగా దాదాపు నాలుగు గ్రామ పంచాయతీలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించామని మరో అయిదారు గ్రామాలకు కల్పిస్తే బస్సు ప్రయాణ సమస్య ఉండదని తెలిపారు. అతి త్వరలో ఆ ఐదు గ్రామాలకు కూడా బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. గత పాలకులు పేదలకు, రైతులకు ఏలాంటి శాశ్వత సాయం చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి అందరికీ పక్కా గృహాలు అదే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే ఫ్రీ బస్ మహిళలకు వచ్చిందని, పేదలకు ఉచిత కరెంటు, ఇతర ప్రభుత్వ సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు. అనంతరం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజు, మాజీ ఎంపీపీ ఆంజనేయులు, చంద్రశేఖర్, ఆంజనేయులు, సత్యనారాయణ రెడ్డి, మాజీ సర్పంచులు గోపాల్ రెడ్డి, సలీం, చౌదరిగూడ తహసిల్దార్, ఎంపీడీవో, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు..

Image 1

సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-06-27 20:20:48

Readmore >
Image 1

ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం

Posted On 2026-06-27 19:10:17

Readmore >
Image 1

ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం

Posted On 2026-06-27 19:06:37

Readmore >
Image 1

ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర

Posted On 2026-06-27 19:05:50

Readmore >
Image 1

గోపా జిల్లా ఉపాధ్యక్షులుగా నాగరాజ్ గౌడ్

Posted On 2026-06-27 19:04:51

Readmore >
Image 1

పట్టుబడిన / సీజ్ చేసిన 687 కిలోల గంజాయిని దహనం

Posted On 2026-06-27 18:49:05

Readmore >
Image 1

ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

Posted On 2026-06-27 10:56:55

Readmore >
Image 1

గంటలోనే ముగ్గురు మైనర్ బాలికల ఆచూకీ..

Posted On 2026-06-27 07:16:30

Readmore >
Image 1

పిల్లలకు తప్పనిసరిగా పోలియో టీకా వేయించాలి : మంత్రి దామోదర

Posted On 2026-06-27 07:11:39

Readmore >
Image 1

మధ్యప్రదేశ్‌లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR

Posted On 2026-06-26 22:39:46

Readmore >