| Daily భారత్
Logo




గరుడ పంచమి మహిమాన్వితమైనది : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

News

Posted on 2024-08-09 15:30:20

Share: Share


గరుడ పంచమి మహిమాన్వితమైనది : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

గరుడ పంచమి పూజలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి

మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు తదితరులు ఆధ్వర్యంలో ఘనంగా గరుడ పంచమి

పెద్ద ఎత్తున హాజరైన మున్సిపల్ చైర్మన్ నరేందర్, కమిషనర్ వెంకన్న, భక్తులు, ప్రముఖులు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: గరుడ పంచమి ఎంతో మహిమాన్విత్వమైనదని హిందూ సంస్కృతి సంప్రదాయాలలో గరుడ పంచమికి ప్రత్యేక విశిష్ట స్థానం ఉందని ఈ పూజలు నిర్వహించిన వారు ఎంతో బలవంతులవుతారని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డిలు అన్నారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే ఆలయ నిర్వాహకులు భక్తులు మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన గరుడ పంచమి కార్యక్రమానికి ప్రముఖులు, మున్సిపల్ చైర్మన్ నరేందర్ కమిషనర్ చీమ వెంకన్న, భక్తులు తదితరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. జానంపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎదురుగా ఉన్న గరుడ విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, బక్కని నరసింహులు, ప్రతాప్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గరుడపంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో  స్వామీ భక్తులకు దర్శనమిచ్చారు. అంతకుముందు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నిర్వహించిన గరుడ వాహనసేవలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. మహిమాణిత్వమైన గరుడ పంచమి గురించి పలువురు వివరిస్తూ.. కశ్యప ప్రజాపతికి వినత, కద్రువ అనే ఇద్దరు భార్యలు ఉండేవారు. వినతకి గరుత్మంతుడు జన్మించిగా, కద్రువ కడుపున సర్పజాతి జన్మించింది. అందువల్ల సర్పజాతి జన్మించిన శ్రావణ శుద్ధ పంచమి నాగ పంచమిగా పిలవబడుతోంది. ఇక ఇదే రోజున వినతకి గరుత్మంతుడు జన్మించాడు కనుక శ్రావణ శుద్ధ పంచమిని గరుడు పంచమిగా కూడా వ్యవహరిస్తున్నాం. అదీగాక ఆయన తన తల్లి వినత దాస్య విముక్తి కోసం ఆయన కనబర్చిన ధైర్యసాహాసాల రీత్యా ఈ పర్యదినానికి ఆయనకి కూడా ప్రాముఖ్యత ఏర్పడింది. కావున శ్రావణ మాసంలో వచ్చే శుద్ధ పంచమని నాగపంచమిగానూ, గరుడ పంచమిగానూ వ్యవహరిస్తున్నాం అనీ కేవలం శ్రావణంలో వచ్చే పంచమికి మాత్రం నాగేంద్రుడి తోపాటు గరుత్మంతునికి అత్యంత ప్రాముఖ్యతనిస్తున్నాం అని భక్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ నరేందర్, మున్సిపల్ కమిషనర్ చీమ వెంకన్న, మాజీ మున్సిపల్ చైర్మన్ అగ్గనూరు విశ్వం, మాజీ జెడ్పిటిసి పి. వెంకటరామిరెడ్డి, కోఆప్షన్ సభ్యులు ఒగ్గుకిషోర్, టిడిపి నేత కుమార్ గౌడ్, కాంగ్రెస్ నేతలు కట్ట వెంకటేష్ గౌడ్, తోకల దామోదర్ రెడ్డి, జంగారెడ్డి రవి తదితరులు పాల్గొన్నారు..

Image 1

దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క

Posted On 2026-06-28 07:18:46

Readmore >
Image 1

సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-06-27 20:20:48

Readmore >
Image 1

ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం

Posted On 2026-06-27 19:10:17

Readmore >
Image 1

ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం

Posted On 2026-06-27 19:06:37

Readmore >
Image 1

ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర

Posted On 2026-06-27 19:05:50

Readmore >
Image 1

గోపా జిల్లా ఉపాధ్యక్షులుగా నాగరాజ్ గౌడ్

Posted On 2026-06-27 19:04:51

Readmore >
Image 1

పట్టుబడిన / సీజ్ చేసిన 687 కిలోల గంజాయిని దహనం

Posted On 2026-06-27 18:49:05

Readmore >
Image 1

ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

Posted On 2026-06-27 10:56:55

Readmore >
Image 1

గంటలోనే ముగ్గురు మైనర్ బాలికల ఆచూకీ..

Posted On 2026-06-27 07:16:30

Readmore >
Image 1

పిల్లలకు తప్పనిసరిగా పోలియో టీకా వేయించాలి : మంత్రి దామోదర

Posted On 2026-06-27 07:11:39

Readmore >