Posted on 2024-08-08 19:38:22
డైలీ భారత్, నాగర్ కర్నూల్ : బ్యాంకును నమ్మి వచ్చే ఖాతాదారుల సొమ్ము ఆ బ్యాంక్ లోనే అక్రమార్కులు స్వాహా చేసేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరక్షరాస్యులను టార్గెట్ చేసుకుని కుచ్చుటోపి పెట్టేశారు. ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసై గుట్టుగా ఖాతాదారుల సొమ్మును లక్షల రూపాయలు స్వంతంగా వాడుకున్నాడు. బ్యాంక్‌లో పనిచేసే బిజినెస్ కోఆర్డినేటర్. విషయం తెలుసుకున్న బ్యాంక్ ఖాతాదారులు లబోదిబోమంటున్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం పెద్దకార్పాముల గ్రామంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఖాతాదారులను మోసం చేసిన ఘటన కలకలం రేపుతోంది. బ్యాంక్‌లో బిజినెస్ కరస్పాండెంట్ గా పనిచేస్తున్న దేవేందర్ అనే వ్యక్తి అమాయక ఖాతాదారుల సొమ్మును హాంఫట్ చేశాడు. గ్రామాల నుంచి వచ్చే నిరక్షరాస్యులైన కస్టమర్స్ ను మోసం చేస్తూ వారి సొమ్మును సొంతానికి వాడుకున్నాడు. ఆన్ లైన్ గేమ్స్ కు బానిసై ఖాతాదారుల రుణాలను నొక్కేశాడు.
బంగారు రుణాలు, క్రాప్ లోన్లను అసరాగా చేసుకొని లక్షల రూపాయలు మాయం చేశాడు దేవెందర్. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ఖాతాదారులకు మాయమాటలు చెప్పి వారికి సహాయం చేసినట్లుగా నటించి వారి సొమ్మును మింగేశాడు. పూర్తిగా రుణాలు చెల్లించే రుణాలను రీ షెడ్యుల్ చేసి ఆ రుణాన్ని తన్నుకుపోయిన ఘటనలు చాలానే వెలుగు చూశాయి. బ్యాంక్ అధికారులకు సంబంధించిన ఐడిలు ప్రైవేటు వ్యక్తిగా ఉన్న బిజినెస్ కో ఆర్డినేటర్ కు ఇవ్వడం ద్వారా అమాయక ప్రజలను ఈజిగా బురిడీ కొట్టించాడు.
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-27 10:56:55
Readmore >