| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

యువత స్వయం ఉపాధి వైపు రాణించాలి: ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి

యువత స్వయం ఉపాధి వైపు రాణించాలి: ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి

శ్రీ మల్లికార్జున బాంక్వెట్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా:యువత స్వయం ఉపాధి వైపు రాణించాలి అని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్నారు.షాద్ నగర్ పట్టణంలోని విజయనగర్ కాలనీలో శ్రీ మల్లికార్జున బాంక్వెట్ హాల్  ప్రారంభోత్సవ పూజా కార్యక్రమంలో  మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. నిర్వాహకులు బచ్చలి నరేష్,పండు,అన్వేష్ మరియు ఇరమోని సాయి కుమార్ లు ఎమ్మెల్సీనీ ఘనంగా సత్కరించారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి యువత స్వయం ఉపాధి వైపు రాణిస్తూ వ్యాపార రంగాలలో రాటుదేలాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సమయం వృధా చేయకుండా మంచి ప్రణాళికలతో యువత వ్యాపార రంగం వైపు మొగ్గు చూపాలని చెప్పారు. సమాజంలో వ్యాపారులకు మంచి గుర్తింపు ఉందని ఎంత లాభసాధిగా ఉంటుందని పేర్కొన్నారు.

Previous పాడిరైతులు మెలు జాతి పశువులను పెంచుకొవాలి
Next సూర్యాపేట్ లో బిత్తిరీసత్తి పై మరొకేసు నమోదు
ADVERTISEMENT