| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పాడిరైతులు మెలు జాతి పశువులను పెంచుకొవాలి

పాడిరైతులు మెలు జాతి పశువులను పెంచుకొవాలి

హెరిటేజ్ జోనల్  హెడ్ సత్యనారాయణ..

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: పాడిరైతులు మెలు జాతి పశువులను పెంచుకొవాలని  హెరిటేజ్ జోనల్ హెడ్ సత్యనారాయణ,రీజినల్ హెడ్ నర్సింగ్ రావ్ అన్నారు.బుదవారం వారు హెరిటేజ్ డైరీ అధ్వర్యంలో  విట్యాల గ్రామంలో పాడి రైతు అవగాహన సదస్సు లో  పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన పాడిరైతులనుద్దేశించి మాట్లాడుతూ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్  అందిస్తున్న రైతు రుణాలు సద్వినియోగం చేసుకొని మెలు జాతి  పాడి సంపదను పెంపొందించుకొవాలని సుచించారు . పశువులకు కావలసిన పోషక విలువలతో కూడిన పశువుల దానాను వినియోగించుకొని నాణ్యమైన పాల ఉత్పత్తిని పొందవచ్చని రైతులకు సూచించారు.అందుకు హెరిటేజ్ ఉత్పత్తి చేస్తున్న పశువుల దానాలు తాము సూచించిన మోతాదులో వాడినట్లయితే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు.తమ సంస్థ ద్వారా ప్రతి పాడి రైతులకు రెండు లక్షల ఉచిత ప్రమాద బీమా కల్పిస్తున్నామని హెరిటేజ్ ద్వరా  పాడి రైతులకు పశువుల దాణా , క్యాల్షియం,మినరల్ మీక్షర్,నట్టల నివారణ మందులను సబ్సిడీ రూపంలో అందిస్తున్నామని  తెలిపారు.అంతేకాకుండా హెరిటేజ్ వెట్ ప్లస్ మొబైల్ యాప్ ద్వారా పశువుల అరొగ్యం పట్ల నిపుణులైన డాక్టర్ల ద్వార ఉచిత సూచనలు సలహాలు  పొందవచ్చని తెలిపారు. అందుకు సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా ఆయన  అందించారు.రైతులు తమ తమ గేదెలకు ఇన్సూరెన్స్ తప్పకుండా చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో హెచ్ ఎఫ్ డబ్ల్యు ఏ బానోతు శ్రీనివాస్,ఏరియా మేనేజర్ వెంకటేశం,హెరిటేజ్ డైరీ మేనేజర్ సందీప్ రెడ్డి,సూపర్ వైజర్ రాజమహేందర్ రెడ్డి ,పాల సేకరణ ప్రతినిధి నందు,మరియు పాడి రైతులు పాల్గొన్నారు.

Previous కరాటే టోర్నమెంట్ బ్రౌచర్ విడుదల చేసిన ఎమ్మెల్యే వీర్లపల్లీ శంకర్
Next యువత స్వయం ఉపాధి వైపు రాణించాలి: ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి
ADVERTISEMENT