| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పెళ్లైన తొలి రాత్రి రోజే వధువు మృతి

పెళ్లైన తొలి రాత్రి రోజే వధువు మృతి

శోభనం గదిలో నవ వధువు మృతి.. 

డైలీ భారత్, కేరళ: పెళ్లైన తొలి రాత్రి రోజే వధువు మృతిచెందిన షాకింగ్ ఘటన కర్ణాటకలోని కోలార్‌లో చోటుచేసుకుంది. చంబరసనహళ్లి ప్రాంతానికి చెందిన నవీన్, లిఖితలకు నిన్న వివాహం జరిగింది.

ఆ తర్వాత లిఖిత తన భర్తతో కలిసి అత్తింటికి వెళ్లింది. అదే రోజున శోభన ఏర్పాట్లు చేసారు. లిఖిత, నవీన్ గదిలోకి వెళ్లాక కేకలు, అరుపులు వినిపించాయి. దాంతో ఏమైందా అని నవీన్ తల్లిదండ్రులు తలుపులు తట్టినా వారు తెరవలేదు. ఓ అరగంట తర్వాత నవీన్ తలుపులు తీసాడు. లోపలికి వెళ్లి చూడగా.. లిఖిత రక్తపుమడుగుల్లో పడి ఉండటం చూసి వారు షాకయ్యారు.

నవీన్‌కు కూడా బాగా గాయాలయ్యాయి. దాంతో ఇద్దరినీ దగ్గర్లోని హాస్పిటల్‌కు తరలించగా లిఖిత అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. నవీన్ పరిస్థితి విషమంగా ఉంది. ఆ తర్వాత పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. నవీన్ శోభన గదిలోకి వెళ్లే ముందు తాగి వెళ్లాడని ఆ సమయంలో వారి మధ్య గొడవ చోటుచేసుకుందని పోలీసులు అనుమానిస్తున్నారు. నవీన్ స్పృహలోకి వస్తే తప్ప ఏం జరిగిందో తెలుసుకోలేమని వారు పేర్కొన్నారు.

Previous భగవద్గీతపై వీడియో చేసి అడ్డంగా బుక్కైన బిత్తిరి సత్తి
Next ఐ ఫోన్ గిప్ట్‌గా ఇచ్చేందుకు అమ్మ బంగారం దొంగతనం చేసిన 9వ తరగతి అబ్బాయి
ADVERTISEMENT