| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పాటతో ప్రజలను చైతన్య పరిచిన యుద్ధనౌక గద్దర్ : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

పాటతో ప్రజలను చైతన్య పరిచిన యుద్ధనౌక గద్దర్ : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

గద్దర్ వర్ధంతి సందర్భంగా  రవీంద్ర భారతిలో కార్యక్రమంలో పాల్గొన్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ప్రజల సమస్యలు సమాజానికి తెలిసేలా పాటతో ప్రజలను చైతన్య పరిచిన ఉద్యమకారుడు, గాయకుడు వ్యక్తి, శక్తి గద్దర్ అని షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్" అన్నారు. రవీంద్ర భారతిలో గద్దర్ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్ గద్దర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ ఉద్యమకారుడు, ప్రజా గాయకుడు గద్దర్ మన మధ్యలో లేకున్నా ఆయన పాట ఆయన మాట ఆగలేదన్నారు. ఆయన అందించిన జ్ఞానాన్ని ప్రజలందరికీ అందించి భావి తరాలకు చైతన్య దిశలో తీసుకెళ్ళాలని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో రాష్ట్రాన్ని దక్కించుకోవడానికి గద్దర్ పాట మూల స్తంభంగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ర్ట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, సీపీఐ నేత నారాయణ తదితరులు పాల్గొన్నారు..

Previous నిరుపేద కుటుంబాలకు అండగా మహబూబాబాద్ జిల్లా పోలీసులు
Next బెయిల్ వద్దు జైల్లోనే ఉంటా..
ADVERTISEMENT