డైలీ భారత్, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS ఆదర్శలతో ముందుకు పోతున్న మహబూబాబాద్ జిల్లా పోలీస్ యంత్రాంగం
మహబూబాబాద్ జిల్లాలో ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో కనీస అవసరాలు లేని వారికీ సహాయం చేస్తూ మానవత్వం చాటుకుంటున్నారు.
నరసింహుళపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక అందునికి ఇల్లు కట్టించి,బియ్యం కిరాణా వస్తువులు అందిచి ఆదర్శంగా నిలిచారు
డోర్నకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరు పట్టించుకోని స్థితిలో ఉన్న వృద్దురాలి ఇంటికి కనీసం కరెంటు కూడా లేకుండ చీకటిలో మగ్గుతుంటే డోర్నకల్ సీఐ, ఎస్.ఐ, సిబ్బంది తో వెళ్లి వృద్దురాలి ఇంట్లో వెలుగు నింపారు.
చిన్న గూడూరు లో ఆధారం లేని 103 సంవత్సరాల వృద్దురాలికి ఎస్.ఐ ఝాన్సీ బియ్యం, కిరణం మరియు కట్టుకోడానికి చీర అందించారు.
ఈరోజు గార్ల మండలంలో నివాసం ఉంటున్న వల్లపూదాసు ధనలక్ష్మి, ఇటీవల తన భర్త చనిపోగా, రోజు గడవక దీననీయ పరిస్థితులో ఉన్నందున మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS నేతృత్వం లో గార్ల ఎస్.ఐ జీనాథ్ కుమార్, బయ్యారం సీఐ రవి కుమార్ సహృదయం తో 50 కిలోల బియ్యం మరియు అవసరాల నిమిత్తం 10 వేల రూపాయలు అందించి బాసటగా నిలవడం జరిగింది