కేరళ వయనాడ్ వరద బాధితులను ఆదుకుందాం
సిపిఐ ఏఐఎస్ఎఫ్ ఏఐటియుసి ఆధ్వర్యంలో షాప్ టు షాప్ విరాళాల సేకరణ కార్యక్రమం
విజయ హాస్పిటల్ చందులాల్ రాథోడ్ కు ధన్యవాదాలు
సిపిఐ పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం. శ్రీను చౌహన్
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: అకాల వర్షాలు, వరదలతో కేరళ రాష్ట్రం లోని వయనాడ్ ప్రాంత ప్రజలు 350కి పైగా మృతిచెందారని వేలసంఖ్యలో నిరాశ్రయులయ్యారని వారిని ఆదుకోవాలని కోరుతూ సీపీఐ షాద్ నగర్ కమిటీ ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రంలో విరాళాలను సేకరించారు. విజయ హాస్పిటల్ చందులాల్ రాథోడ్ కు ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం శ్రీను మాట్లాడుతూ... వరద బాధితుల సహాయార్థం మానవ త్వం కలిగిన ప్రతిఒక్కరు తోచిన విధంగా ధన, వస్తురూపేన సహాయం అందించాలని కోరారు. సేకరించిన విరాళాలను రాష్ట్ర నాయకత్వం ద్వారా కేరళ ప్రజలకు అందిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎం పవన్ చౌహన్ ఆకాష్ సాయి సిపిఐ మండల కార్యదర్శి లింగం నాయక్ చంద్రబాబు శంకర్ తదితరులు పాల్గొన్నారు..