శ్రీ కురుమూర్తి స్వామిని దర్శించుకున్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
పర్యటనలో పాల్గొన్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: టూరిజం డెవలప్మెంట్ లో భాగంగా దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు కురుమూర్తి స్వామి దేవస్థాన పరిసరాలలో పర్యటించి, సరళా సాగర్ డ్యామ్ పరిశీలించారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్న టూరిజం అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, ఏఐసీసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, ఉమ్మడి మహబూబ్ నగర్ కు చెందిన ఎమ్మెల్యేలు..షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కుచుకుళ్ల రాజేష్ రెడ్డి, అచ్చం పేట్ ఎమ్మెల్యే వంశీకృష్ణ, వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్, గద్వాల జడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య తదితరులు..