| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

జిల్లా గ్రంధాలయ సంస్థకు పుస్తకాలు అందజేత

జిల్లా గ్రంధాలయ సంస్థకు పుస్తకాలు అందజేత

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: విద్యార్థుల ప్రయోజనం కోసం పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి స్టడీ మెటీరియల్ అందిస్తున్నామని బి.ఎన్ రావు ట్రస్ట్ ఫౌండర్ డాక్టర్ బి.ఎన్.రావు అన్నారు. శనివారం జిల్లా గ్రంధాలయ సంస్థకు పోటీ పరీక్షలకు అవసరమైన స్టడీ మెటీరియల్ అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను గ్రంథాలయ సంస్థ నుంచి  ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను తెలిపారు. యువత పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న క్రమంలో వారికి ఉపయోగపడేలా బి.ఎన్ ట్రస్ట్ ద్వారా స్టడీ మెటీరియల్ అందజేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఆసిఫాబాద్ కరీంనగర్ తో పాటు అనేక జిల్లాల్లో సేవలు అందించామని తెలిపారు. విద్యార్థుల ఉపయోగం కోసం అందిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు అన్ని పోటీ పరీక్షలకు కావలసిన శిక్షణ అందిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పత్తిపాక పద్మ, గుండ్లపల్లి నీరజ, ట్రస్టు నిర్వాహకులు విద్యార్థులు పాల్గొన్నారు.

Previous పెండింగ్ భూ సమస్యల పరిష్కారానికి పటిష్ట చర్యలు : సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్
Next ఏసీబీకి చిక్కిన తహసిల్దార్
ADVERTISEMENT