| Daily భారత్
Logo




మానవత్వం చాటుకున్న జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

News

Posted on 2024-08-02 15:10:31

Share: Share


మానవత్వం చాటుకున్న జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

చిన్నారి నయనశ్రీ  వైద్యానికి అండగా నిలిచిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ..

మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు చర్యలు

చిన్నారి తల్లి, మండల తహసిల్దార్ జాయింట్ ఖాతా ప్రారంభించి 10 లక్షల రూపాయల జమ..

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: వీర్నపల్లి మండలం గర్జనపల్లి గ్రామానికి చెందిన గజ్జెల దిలీప్ శ్యామల దంపతుల చిన్న కూతురైన చిన్నారి నయన శ్రీ క్యాన్సర్ తో బాధ పడుతున్న నేపథ్యంలో  ఆ చిన్నారి వైద్య చికిత్స కు సంపూర్ణ మద్దతు  అందించేందుకు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ముందుకు వచ్చి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. 

శుక్రవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ వీర్నపల్లి మండలం గర్జనపల్లి గ్రామంలోని చిన్నారి ఇంటిని సందర్శించారు. చిన్నారికి వచ్చిన క్యాన్సర్ వ్యాధి, చికిత్స నిమిత్తం ఇప్పటికే తల్లిదండ్రులు 3 లక్షల రూపాయలను అప్పుచేసి ఖర్చు చేశారని కలెక్టర్ తెలుసుకున్నారు. 

చిన్నారికి మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని జిల్లా కలెక్టర్ కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. వీర్నపల్లి మండల తహసిల్దార్, చిన్నారి తల్లి పేరు మీద జాయింట్ బ్యాంకు ఖాతా ప్రారంభించిన వెంటనే అందులో వైద్య ఖర్చుల నిమిత్తం 10 లక్షల రూపాయలు జమ చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. 

చిన్నారికి ఉన్న క్యాన్సర్ వ్యాధిని పూర్తిస్థాయిలో నయం చేసేందుకు మెరుగైన వైద్యం ఎక్కడ అందించాలనే అంశాన్ని పరిశీలించి నివేదిక సమర్పించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు . డీఎంహెచ్ఓ రిపోర్ట్ ప్రకారం చిన్నారి చికిత్స ప్రారంభించాలని, బ్యాంకు లో జమ చేసిన నిధులు చికిత్స కోసం వినియోగించాలని కలెక్టర్ పేర్కొన్నారు. 

చిన్నారి చికిత్స కోసం అవసరమైతే మరిన్ని నిధులను కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నామని, తల్లిదండ్రులు ఎటువంటి బెంగ అవసరం లేదని, చిన్నారి వైద్య చికిత్స నిమిత్తం ఏ సమయంలో నైనా, ఎలాంటి సహాయం అవసరం ఉన్నా నేరుగా తనకు ఫోన్ చేయాలని కలెక్టర్ తెలిపారు. 


అనంతరం తిరిగి సిరిసిల్ల మార్గ మధ్యలో రంగంపేట వద్ద చెట్లు నరుకుతున్న వారి పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  అనవసరంగా చెట్లు, కొమ్మలు నరకడం ఇక పై పునరావృతం కావద్దని, మొక్కలు నాటే సమయంలోనే విద్యుత్ వైర్లకు దూరంగా నాటాలని, విద్యుత్ తీగలు చెట్ల పైకి రాకుండా చూసుకుని మొక్కలు నాటాలని ఆదేశించారు.

Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >
Image 1

అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-07-04 14:03:34

Readmore >
Image 1

కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు

Posted On 2026-07-04 13:59:26

Readmore >
Image 1

ఏసీబీ వలలో తిరుపతి జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్

Posted On 2026-07-04 07:18:45

Readmore >
Image 1

భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం

Posted On 2026-07-03 23:06:05

Readmore >
Image 1

అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్

Posted On 2026-07-03 23:04:17

Readmore >
Image 1

గిరిజన శివశక్తుల పూజారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

Posted On 2026-07-03 18:35:18

Readmore >
Image 1

స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్

Posted On 2026-07-03 18:34:08

Readmore >
Image 1

SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-07-03 18:31:55

Readmore >
Image 1

నాతవరం పోలీసుల స్పీడ్ : రూ.5.6 లక్షల స్నాచింగ్, 3 గంటల్లోనే రికవరీ

Posted On 2026-07-03 18:28:35

Readmore >