Posted on 2023-08-27 11:06:45
కొత్తగా క్రియేట్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
10 మంది విద్యార్థులకు ఒక టీచర్
ఆర్థిక శాఖ ఆమోదం.. జీవో జారీ
డీఎస్సీకి మార్గం సుగమం
హైదరాబాద్ :ఆగస్టు 27
తెలంగాణ సర్కారు మరో మానవీయ నిర్ణయం తీసుకొన్నది. బుద్ధిమాంద్యత, ఆటిజం, మాస్క్యూలర్ డిస్ట్రోఫీవంటి పలు రకాలైన వైకల్యాలతో బాధపడుతున్న విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ప్రత్యేకంగా టీచర్లను నియమించాలని నిర్ణయించింది.
శాశ్వత ప్రాతిపదికన స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లను నియమించేందుకు పచ్చజెండా ఊపింది. పది మంది విద్యార్థులకు ఒకరు చొప్పున మొత్తంగా 1,523 స్పెషల్ ఎడ్యుకేషన్ ఫర్ డిజేబుల్డ్ టీచర్ పోస్టులను కొత్తగా మంజూరు చేయడమే కాకుండా ఆయా పోస్టుల నియామకానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
ఈ మేరకు శనివారం ఆర్థికశాఖ జీవో నెంబర్-125ను జారీచేసింది. వీటిలో ప్రాథమికోన్నత పాఠశాలల్లో 798, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 727 టీచర్ పోస్టులు ఉన్నాయి.
ప్రాథమిక పాఠశాలల్లో బోధించే సెకండరీ గ్రేడ్ టీచర్ పే స్కేల్ రూ. 31,040 -92,050, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో బోధించే స్కూల్ అసిస్టెంట్ టీచర్ పేస్కేల్ రూ.42,300 -1,15,270గా ఖరారు చేసింది.
విద్యాశాఖ సర్వే ప్రకారం రాష్ట్రంలో 30వేల వరకు ప్రత్యేకావసరాలు గల చిన్నారులు ఉన్నారు. వీరంతా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. వీరిలో 10,900 మంది ప్రాథమిక పాఠశాలల్లో, మరో 18,857 మంది ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు.
కొత్తగా మంజూరు చేసిన 1,523 మంది టీచర్ల ద్వారా ప్రత్యేక అవసరాలుగల పిల్లలకు వారి అవసరాల మేరకు విద్యాబోధన చేయనున్నారు
బిపిఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-15 06:39:17
Readmore >
విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-14 22:44:54
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబరాన్ని అంటిన భోగి & సంక్రాంతి సంబరాలు
Posted On 2026-01-14 18:45:43
Readmore >