" /> ." /> ." />
Posted on 2023-08-26 10:23:47
బెంగళూరు: విదేశీ పర్యటన ముగించుకొని ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా బెంగళూరుకు వచ్చారు. చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించేందుకు మోదీ ఇక్కడి వచ్చిన సంగతి తెలిసిందే..
ఈ సందర్భంగా విమానాశ్రయం వద్దకు వచ్చిన అభిమానులు, ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. జై విజ్ఞాన్.. జై అనుసంధాన్ నినాదం ఇచ్చారు. "చంద్రుడిపై మన ల్యాండర్ దిగినప్పుడు భారత్‌లో నేను లేను. ఆ అద్భుత క్షణాలను విదేశాల నుంచి చూశా. అప్పుడే నేరుగా బెంగళూరుకు రావాలని అనుకున్నా. భారత్ రాగానే శాస్త్రవేత్తలను కలుసుకొని అభినందించాలనుకున్నా. ఇస్రో శాస్త్రవేత్తలను కలవాలని చాలా ఆత్రుతగా ఉన్నా" అని మోదీ వెల్లడించారు.
అనంతరం విమానాశ్రయం నుంచి నుంచి నేరుగా పీణ్యలోని ఇస్రో కేంద్రానికి మోదీ వెళ్లారు. ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. ఈ సందర్భంగా చంద్రయాన్-3 ప్రయోగం తీరును ప్రధానికి ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ వివరించారు..
బిపిఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-15 06:39:17
Readmore >
విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-14 22:44:54
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబరాన్ని అంటిన భోగి & సంక్రాంతి సంబరాలు
Posted On 2026-01-14 18:45:43
Readmore >