| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

చలో ఢిల్లీ కార్యక్రమన్ని విజయ వంతం చేయండి : జాంగారి రవి

చలో ఢిల్లీ కార్యక్రమన్ని విజయ వంతం చేయండి : జాంగారి రవి

ఈనెల 6, 7 తేదీల్లో చలో ఢిల్లీ 

టిఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు సిర్సనోళ్ల బాలరాజ్ 

తెలంగాణ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు జాంగారి రవి పిలుపు 

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఎస్సి వర్గీకరణ బిల్లు పార్లమెంట్ సమావేశ లలో ప్రవేశ పెట్టాలి అని డిమాండ్ చేస్తూ టీఎంఆర్పిఎస్, టీఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో  ఈనెల 6,7 వ తేదీలలో జరిగే చలో ఢిల్లీలో దీక్ష, ధర్నా, కార్యక్రమం ఉందని ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జయప్రదం చేయాల్సిందిగా తెలంగాణ స్టూడెంట్ మాదిగ ఫెడరేషన్ జాంగారి రవి తెలిపారు. ఈ సందర్బంగా జాంగారి రవి మాట్లాడుతూ ఇప్పుడు జరిగే పార్లమెంటు వర్ష కాల సమావేశంలో బిల్లు ఆమోదం పొందే విధంగా చర్యలు చేపట్టాలి. ఎస్.సి. వర్గీకరణ చట్టబద్ధత కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా సానుభూతితో కూడిన సరైన నిర్ణయం తీసుకొని భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని బలపరుస్తూ పెద్ద సామాజికవర్గమైన మాదిగ (చమార్), మాదిగ ఉపకులాలకు న్యాయం చేయాలని గతంలో  బీజేపీ కేంద్ర ప్రభుత్వం మాదిగలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని తక్షణమే ఎస్.సి. వర్గీకరణ బిల్లు ఉషామెహ్రా కమిషన్ ఆధారంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఎస్.సి.ల జనాభా దామాష ప్రకారం ఎ, బి, సి, డి, బిల్లు పార్లమెంటు సమావేశాల్లో చట్టబద్ధత పొందే విధంగా చూడాలని కేంద్ర ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎంఆర్ పిఎస్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగపగ జంగయ్య, రాష్ట్ర నాయకులు కర్రే కృష్ణయ్య, భీంరాజ్, మసయ్య, రాజు, శ్యామ్, మాదిగ పెడరేషన్ నాయకులు దాసరి శివ, విజయ్, కల్యాణ్, వరప్రసాద్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు..

Previous చౌడమ్మగుట్ట శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా పల్లకీ సేవ
Next బీజేపీ లో చేరిన బీఆర్ఎస్ సోషల్ సర్వీస్ అధ్యక్షులు ప్రవీణ్
ADVERTISEMENT