Posted on 2024-07-27 13:52:16
కుమారుడి జన్మదినం సందర్భంగా భక్తులకు అన్నదానం చేసిన రమేష్
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపాలిటి పరిధిలోని సోలిపూర్ చౌడమ్మగుట్ట శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో శనివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భజన భక్త బృందం సభ్యుల ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. శ్రీ ఆంజనేయస్వామి విగ్రహాన్ని పల్లకిలో మోస్తూ శ్రీరామ జయరామ, జయ జయ రామ నినాదాలతో ఆట పాటలతో, భజనలతో భక్తులు పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించారు. భక్తి పాటలు భజనలతో ఆలయంలో శ్రీరామ నామ స్మరణ మార్మోగింది. ఆలయ ప్రధాన అర్చకులు రఘుపతిరావు, రాఘవేంద్ర చార్య, అర్చకులు కృష్ణ, ప్రమోద్, సునీల్ పంతులు భక్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం దేవాలయ భజన భక్త బృందం సభ్యులు బొట్టు రమేష్ తన కుమారుడు నవీన్ జన్మదినం సందర్భంగా దేవాలయానికి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా బుర్రి పురుషోత్తం గౌడ్, లాస్య దంపతులు దేవాలయ అభివృద్ధికి మూడు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా అన్నదానం చేసిన బొట్టు రమేష్ కుమారుడు నవీన్ మరియు బుర్రి పురుషోత్తం గౌడ్ దంపతులను మరియు దేవాలయంలో ప్రతి శనివారం పులిహోర ప్రసాదాల దాత ఆగిరి శేఖర్ దంపతులను పూలమాలతో ఘనంగా సన్మానించారు. దేవాలయ అభివృద్ధికి, అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పులిమామిడి శ్రీశైలం గౌడ్, అన్నారం రఘు గౌడ్, గడ్డమీద రమేష్ ముదిరాజ్, రఘునందన్ రెడ్డి, లక్ష్మణ్, క్యూసెట్ శ్రీనివాస్, కిషన్ నాయక్, రాఘవేందర్, నారాయణ, వీర్లపల్లి కృష్ణయ్య, లక్ష్మికాంత్ రెడ్డి, కృష్ణ చారి, శంకరయ్య యాదవ్, వీఆర్వో బచ్చన్న, యాదగిరి, పి.ప్రవీణ్ గౌడ్, పద్మా వెంకటేష్, గోరియా నాయక్, కొత్త సత్తయ్య గౌడ్, శ్రీనివాస్, రమేష్, సుధాకర్ రెడ్డి, హనుమంత్ రెడ్డి, రవీందర్, మాజీ వార్డు సభ్యులు సింగపాగ లక్ష్మయ్య, భజన భక్త బృందం, మహిళలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >