| Daily భారత్
Logo




ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

News

Posted on 2026-07-08 07:13:19

Share: Share


ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త.

భార్యాభర్తల మధ్య గొడవ ప్రాణాలు తీసే వరకు వెళ్లింది. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న భార్యను కత్తితో గొంతుకోసి హతమార్చాడు.

డైలీ భారత్, కదిరి: సత్యసాయి జిల్లా కదిరిలోని ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఈ దారుణం చోటుచేసుకుంది. ముదిగుబ్బ మండలం ఈదులపల్లి గ్రామానికి చెందిన గంగరాజు అనే వ్యక్తి, తన భార్య సునీత (32)ను ఆసుపత్రి ఆవరణలోనే అత్యంత క్రూరంగా గొంతు కోసి హత్య చేశాడు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

భర్త దాడిలో గాయాలు.. కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దంపతుల మధ్య తలెత్తిన తీవ్రమైన గొడవ కారణంగా గంగరాజు తన భార్యపై దాడిచేశాడు. భర్త దాడిలో గాయపడిన సునీతకు చికిత్స అందించేందుకు ఆమెను కుటుంబ సభ్యులు కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలోని మహిళా వార్డులో ఆమె చికిత్స పొందుతోంది. అయితే నిందితుడు గంగరాజు అక్కడికి చేరుకుని, మెరుగైన వైద్యం కోసం వేరే ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్దామని కుటుంబసభ్యులను నమ్మించాడు. హాస్పిటల్ వార్డు నుంచి భార్య సునీతను బయటకు తీసుకువచ్చాడు.

కత్తితో గొంతు కోసి భర్త దారుణం

ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్లేందుకు కదిరి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోకి రాగానే, ప్లాన్ ప్రకారం తన వెంట తెచ్చుకున్న కత్తితో గంగరాజు భార్య సునీత గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణంపై సమాచారం అందుకున్న కదిరి పట్టణ సీఐ నారాయణరెడ్డి తమ సిబ్బందితో కలిసి వెంటనే ఆసుపత్రికి చేరుకుని పరిశీలించారు. అప్పటికే కుటుంబసభ్యులు, మరికొందరు వ్యక్తులు పట్టుకున్న నిందితుడు గంగరాజును అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన కదిరి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు, తప్పిదాలు జీవితాలను తలకిందులు చేస్తాయని.. కుటుంబాలు రోడ్డున పడతాయని పోలీసులు ప్రజలను హెచ్చరించారు

Image 1

చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి

Posted On 2026-09-11 03:39:31

Readmore >
Image 1

నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-09-10 15:22:16

Readmore >
Image 1

కామారెడ్డిలో రైస్ మిల్లర్ల మహా ధర్నా విజయవంతం...

Posted On 2026-09-10 15:19:28

Readmore >
Image 1

CMRF ద్వారా లక్ష్మణ్‌కు రూ.19,000 ఆర్థిక సహాయం

Posted On 2026-09-10 09:43:29

Readmore >
Image 1

ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణం

Posted On 2026-09-10 07:03:46

Readmore >
Image 1

వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్

Posted On 2026-09-10 07:02:32

Readmore >
Image 1

వాటర్ బాటిలు అధిక ధర.. రూ.7 లక్షలు ఫైన్!

Posted On 2026-09-09 17:17:04

Readmore >
Image 1

కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్

Posted On 2026-09-09 14:45:53

Readmore >
Image 1

స్పీకర్ కు బీఆర్ఎస్ బహిరంగ క్షమాపణ చెప్పాలి

Posted On 2026-09-09 14:29:32

Readmore >
Image 1

దేమేకలాన్ పాఠశాలలో ఘనంగా కలోజి నారాయణరావు జయంతి వేడుకలు

Posted On 2026-09-09 14:28:15

Readmore >