Posted on 2026-07-07 14:03:47
డైలీ భారత్, కామారెడ్డి / న్యూఢిల్లీ: కామారెడ్డి మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి గడ్డం ఇందుప్రియ ఢిల్లీలోని ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ గారి నివాసంలో ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాల అమలు, మహిళా సాధికారతకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై విస్తృతంగా చర్చించారు.
అలాగే, కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడం, మహిళలను పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా భాగస్వాములను చేయడం, ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా చేరవేయడంపై అభిప్రాయాలను పరస్పరం పంచుకున్నారు.
ఈ సందర్భంగా గడ్డం ఇందుప్రియ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని, పార్టీ బలోపేతం కోసం తాను నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.
చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి
Posted On 2026-09-11 03:39:31
Readmore >
నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-09-10 15:22:16
Readmore >
వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్
Posted On 2026-09-10 07:02:32
Readmore >
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >