| Daily భారత్
Logo




ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

News

Posted on 2026-07-06 04:34:19

Share: Share


ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

డైలీ భారత్, రేవారి : ప్రియుడితో కలిసి ఉండాలనే ఉద్దేశంతో కొత్తగా పెళ్లైన భర్తను దారుణంగా హత్య చేసిన ఘటన హర్యానాలో వెలుగు చూసింది. ఈ కేసులో భార్యతో పాటు మరొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

రేవారి జిల్లా జడ్తాల్ గ్రామానికి చెందిన మోను(21)కు 3 సంవత్సరాల క్రితం కసోలి గ్రామానికి చెందిన తన్ను తో పెళ్లయింది. మోను రాజస్థాన్ లోని ఖుష్‌ఖేరా పారిశ్రామిక ప్రాంతంలో ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు.

జూన్ 8న రాత్రి 10 గంటలకు మందు తీసుకురావడానికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన మోను తిరిగి రాలేదు. అత్తారింటికి వెళ్లలేదని తెలియడంతో కుటుంబీకులు జూన్ 9న కసోలా పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.

జూన్ 10న అసల్వాస్ గ్రామం సమీపంలోని కెనాల్‌లో యువకుడి మృతదేహం కనిపించింది. గుర్తింపు ప్రక్రియలో అది మోను అని తేలింది. మొదట్లో ఇది ప్రమాద మరణంగా పోలీసులు భావించారు. కెనాల్ వద్ద మోను స్కూటర్ ఉండటంతో అనుమానాలు రాలేదు.

దర్యాప్తులో భాగంగా మోను ఫోన్‌ను సైబర్ నిపుణులకు ఇచ్చారు. ఫోన్ డేటా డిలీట్ చేసి ఉండటం, జూన్ 8న భార్య తన్ను తో మోను మాట్లాడినట్టు తేలడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. విచారణలో తన్ను నేరం ఒప్పుకుంది.

తాను, తన ప్రియుడు సోను, స్నేహితులు హరిఓమ్, అమన్‌లతో కలిసి కుట్ర పన్నినట్టు చెప్పింది. జూన్ 8న కెనాల్ వద్దకు మోనును రప్పించి.. నోరు, ముక్కు మూసి ఊపిరాడకుండా చేసి, అనంతరం కెనాల్‌లో పడేసినట్టు తెలిపింది. దీన్ని ప్రమాదంగా చిత్రీకరించేందుకు స్కూటర్‌ను అక్కడే వదిలినట్టు పోలీసులకు చెప్పింది.

ఈ కేసులో భార్య తన్ను, హరిఓమ్‌లను జూలై 5న అరెస్ట్ చేసి 2 రోజుల పోలీస్ రిమాండ్‌కు తరలించారు. ప్రియుడు సోను, అమన్ పరారీలో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నామని బవాల్ డీఎస్పీ సురేంద్ర షియోరాన్ తెలిపారు.

ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Image 1

చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి

Posted On 2026-09-11 03:39:31

Readmore >
Image 1

నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-09-10 15:22:16

Readmore >
Image 1

కామారెడ్డిలో రైస్ మిల్లర్ల మహా ధర్నా విజయవంతం...

Posted On 2026-09-10 15:19:28

Readmore >
Image 1

CMRF ద్వారా లక్ష్మణ్‌కు రూ.19,000 ఆర్థిక సహాయం

Posted On 2026-09-10 09:43:29

Readmore >
Image 1

ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణం

Posted On 2026-09-10 07:03:46

Readmore >
Image 1

వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్

Posted On 2026-09-10 07:02:32

Readmore >
Image 1

వాటర్ బాటిలు అధిక ధర.. రూ.7 లక్షలు ఫైన్!

Posted On 2026-09-09 17:17:04

Readmore >
Image 1

కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్

Posted On 2026-09-09 14:45:53

Readmore >
Image 1

స్పీకర్ కు బీఆర్ఎస్ బహిరంగ క్షమాపణ చెప్పాలి

Posted On 2026-09-09 14:29:32

Readmore >
Image 1

దేమేకలాన్ పాఠశాలలో ఘనంగా కలోజి నారాయణరావు జయంతి వేడుకలు

Posted On 2026-09-09 14:28:15

Readmore >