Posted on 2026-07-05 08:14:43
డైలీ భారత్,ఉంగుటూరు: ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. చేబ్రోలు స్టేషన్ సమీపంలో రైలు ఢీకొని నలుగురు మృతి చెందారు.
మృతుల్లో ముగ్గురు మహిళలు, యువకుడు ఉన్నారు. చర్లపల్లి-షాలిమార్ స్పెషల్ ట్రైన్ ఢీకొనడంతో వీరంతా అక్కడికక్కడే మరణించినట్టు రైల్వే పోలీసులు తెలిపారు.
ఈ నలుగురూ ఆత్మహత్యకు పాల్పడ్డారా? లేక రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదం జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలిలో షేక్ హసీనా పేరుతో ఉన్న ఏటీఎం కార్డు, తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో పార్కింగ్ రశీదు, ధ్వంసమైన రెండు సెల్ఫోన్లు గుర్తించారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు
Posted On 2026-09-11 09:53:32
Readmore >
చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి
Posted On 2026-09-11 03:39:31
Readmore >
నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-09-10 15:22:16
Readmore >
వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్
Posted On 2026-09-10 07:02:32
Readmore >
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >