| Daily భారత్
Logo




రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

News

Posted on 2026-07-07 14:17:19

Share: Share


రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: గంభీరావుపేట పోలీస్ స్టేషన్‌లో నమోదైన రెండు హత్య కేసుల్లో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించినట్లు మంగళవారం సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీరజ కీలక తీర్పు వెల్లడించారని జిల్లా ఎస్పీ తెలిపారు.

నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన పోలీస్ అధికారులను, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను, కోర్టు కానిస్టేబుళ్లను జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే అభినందించారు.

కేసు - 1 వివరాలు

గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వంగ సందీప్ రెడ్డి S/o వంగ శ్రీనివాస్ రెడ్డి కి, బీనబోయిన దేవయ్యకు మధ్య భూ వివాదాలు ఉన్నాయి. ఆ భూమి విషయంలో తరచు గొడవలు జరుగుతున్న నేపథ్యంలో సందీప్ రెడ్డి, దేవయ్యను ఎలాగైనా చంపాలనే ఉద్దేశంతో 17.03.2018న దేవయ్య కుటుంబ వేడుకకు హాజరైన సమయంలో చాటుగా వచ్చి కత్తితో దాడి చేయగా దేవయ్య మరణించాడు. దేవయ్య తండ్రి బీనబోయిన సిద్ధిరాములు ఫిర్యాదు మేరకు గంభీరావుపేట పోలీస్ స్టేషన్‌లో అప్పటి CI రవీందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అనంతరం నిందితుడు వంగ సందీప్ రెడ్డిని రిమాండ్‌కు తరలించగా, CI బన్సీలాల్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.

కేసు - 2 వివరాలు

అదే గ్రామానికి చెందిన వంగ సందీప్ రెడ్డి S/o శ్రీనివాస్ రెడ్డి కి, కామారెడ్డికి చెందిన మాన్నె నరసింహులుకు కూడా భూ వివాదాలు ఉన్నాయి. ఈ కారణంగా 31.07.2022న నరసింహులు తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటున్న సమయంలో సందీప్ రెడ్డి వచ్చి గొడ్డలితో దాడి చేయగా నరసింహులు అక్కడికక్కడే మరణించాడు. నరసింహులు అన్న కుమారుడు మాన్నె రాజు ఫిర్యాదు మేరకు గంభీరావుపేట పోలీస్ స్టేషన్‌లో అప్పటి CI మొగిలి కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం చార్జిషీట్ దాఖలు చేశారు.

కోర్టు విచారణ

పై రెండు హత్య కేసుల విచారణలో అదనపు ఎస్పీ చంద్రయ్య పర్యవేక్షణలో కోర్ట్ మానిటరింగ్ SI రవీందర్ నాయుడు, కోర్టు కానిస్టేబుల్ శ్రీనివాస్, అప్పటి మరియు ప్రస్తుత CI లు రవీందర్, మొగిలి, బన్సీలాల్, వెంకటేష్, గంభీరావుపేట SI శ్రీకాంత్, కోర్టు మానిటరింగ్ కానిస్టేబుల్ నవీన్ ఆధ్వర్యంలో 20 మంది సాక్షులను కోర్టు ముందు ప్రవేశపెట్టారు. ప్రాసిక్యూషన్ తరపున అప్పటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంట శ్రీనివాస్ గారు వాదనలు వినిపించారు. శాస్త్రీయ, సాంకేతిక సాక్ష్యాలను పరిశీలించిన అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిందితుడు సందీప్ రెడ్డికి రెండు కేసుల్లో జీవిత ఖైదు (యావజ్జీవ కారాగార శిక్ష) విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చారు.

సమాజంలో నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకోలేరని, శిక్షల ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని జిల్లా ఎస్పీ తెలిపారు. పోలీసులు మరియు ప్రాసిక్యూషన్ సమన్వయంతో వ్యూహాత్మకంగా న్యాయ విచారణ నిర్వహించి నిందితులకు తప్పనిసరిగా శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

పై కేసుల్లో నిందితులకు శిక్ష పడటంలో కృషి చేసిన అదనపు ఎస్పీ చంద్రయ్య, అప్పటి PP పెంట శ్రీనివాస్, ప్రస్తుత DSP నాగేంద్రచారి, CI లు రవీందర్, మొగిలి, బన్సీలాల్, వెంకటేష్, కోర్ట్ మానిటరింగ్ SI రవీందర్ నాయుడు, కోర్టు కానిస్టేబుల్ శ్రీనివాస్, గంభీరావుపేట SI శ్రీకాంత్, కోర్టు మానిటరింగ్ కానిస్టేబుల్ నవీన్ లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

Image 1

చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి

Posted On 2026-09-11 03:39:31

Readmore >
Image 1

నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-09-10 15:22:16

Readmore >
Image 1

కామారెడ్డిలో రైస్ మిల్లర్ల మహా ధర్నా విజయవంతం...

Posted On 2026-09-10 15:19:28

Readmore >
Image 1

CMRF ద్వారా లక్ష్మణ్‌కు రూ.19,000 ఆర్థిక సహాయం

Posted On 2026-09-10 09:43:29

Readmore >
Image 1

ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణం

Posted On 2026-09-10 07:03:46

Readmore >
Image 1

వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్

Posted On 2026-09-10 07:02:32

Readmore >
Image 1

వాటర్ బాటిలు అధిక ధర.. రూ.7 లక్షలు ఫైన్!

Posted On 2026-09-09 17:17:04

Readmore >
Image 1

కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్

Posted On 2026-09-09 14:45:53

Readmore >
Image 1

స్పీకర్ కు బీఆర్ఎస్ బహిరంగ క్షమాపణ చెప్పాలి

Posted On 2026-09-09 14:29:32

Readmore >
Image 1

దేమేకలాన్ పాఠశాలలో ఘనంగా కలోజి నారాయణరావు జయంతి వేడుకలు

Posted On 2026-09-09 14:28:15

Readmore >