Posted on 2026-07-08 14:21:40
భరోసా కేంద్రాన్ని సందర్శించి సేవలను సమీక్షించిన జిల్లా కలెక్టర్ అశిష్ సంగ్వాన్, ఐఏఎస్ – జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
సత్వర వైద్య, న్యాయ, మానసిక సహాయ సేవలు ఒకే వేదికపై అందేలా సమన్వయంతో పనిచేయాలి
డైలీ భారత్, కామారెడ్డి: మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల బాధితులకు సత్వర న్యాయం, రక్షణ, పునరావాసం కల్పించడంలో భరోసా కేంద్రం కీలక పాత్ర పోషిస్తోందని జిల్లా కలెక్టర్ శ్రీ అశిష్ సంగ్వాన్, ఐఏఎస్ , జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ పేర్కొన్నారు.
ఈరోజు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ సంయుక్తంగా కామారెడ్డి జిల్లా భరోసా కేంద్రాన్ని సందర్శించి అక్కడ బాధితులకు అందుతున్న సేవలు, నమోదైన కేసుల పురోగతి, వివిధ శాఖల మధ్య సమన్వయం, పునరావాస చర్యలు, కౌన్సెలింగ్, న్యాయ సహాయం, వైద్య సేవలు తదితర అంశాలపై భరోసా కోఆర్డినేటర్, భరోసా కేంద్ర సిబ్బంది తో సమగ్ర సమీక్ష నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,
భరోసా కేంద్రానికి వచ్చే ప్రతి బాధితురాలికి ఒకే వేదికపై వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించడం మనందరి బాధ్యత. వైద్య, న్యాయ, పోలీసు, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ,
భరోసా కేంద్రానికి వచ్చే ప్రతి బాధితురాలితో సిబ్బంది అత్యంత సానుభూతితో, మానవీయ దృక్పథంతో వ్యవహరించాలి. వైద్య సేవలు, మానసిక కౌన్సెలింగ్, ఉచిత న్యాయ సహాయం, పోలీసు సహాయం, పునరావాస సేవలు ఎలాంటి ఆలస్యం లేకుండా సమన్వయంతో అందించాలి. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల కేసుల్లో దర్యాప్తును వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేసి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు చేపట్టాలి. ప్రతి కేసులో బాధితుల వ్యక్తిగత వివరాల గోప్యతను అత్యంత ప్రాధాన్యతగా భావించి కచ్చితంగా పరిరక్షించాలి. బాధితుల్లో విశ్వాసాన్ని పెంపొందించే విధంగా భరోసా కేంద్రం సేవలు మరింత సమర్థవంతంగా ఉండాలి. అని సూచించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ భరోసా కేంద్రంలోని కౌన్సెలింగ్ గదులు, లీగల్ సెల్, మెడికల్ ఎయిడ్ విభాగం, రికార్డు నిర్వహణ విధానం, బాధితులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించి సేవల నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో భరోసా కేంద్రం కోఆర్డినేటర్ కవిత, భరోసా కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు
చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి
Posted On 2026-09-11 03:39:31
Readmore >
నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-09-10 15:22:16
Readmore >
వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్
Posted On 2026-09-10 07:02:32
Readmore >
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >