బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో బిజెపి లో చేరిన రంగారెడ్డి జిల్లా తెలంగాణ సోషల్ సర్వీస్ అధ్యక్షులు గడ్డమీది ప్రవీణ్
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: కొందుర్గు మండలం రేగడి చిల్కమర్రి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు రంగారెడ్డి జిల్లా తెలంగాణ సోషల్ సర్వీస్ అధ్యక్షులు గడ్డమీది ప్రవీణ్ మరియు మొదల్ల గూడ గ్రామానికి చెందిన లింగం ఈరోజు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో బిజెపిలో చేరడం జరిగింది. వారికి విష్ణువర్ధన్ రెడ్డి బిజెపి కండువా కప్పి పార్టీ లోకి అవ్హానించడం జరిగింది.
విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ .. పార్టీ కోసం కస్టపడి పనిచేసి వచ్చే పంచాయతీ ఎన్నికల్లో పంచాయతీలను మనమే గెలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కోగూరు వెంకట్ రెడ్డి పాల్గొన్నారు