| Daily భారత్
Logo




సిద్దిపేట ట్రాఫిక్ నూతన ఇన్స్పెక్టర్ (సీఐ)గా పదవీ బాధ్యతలు చేపట్టిన కె. ప్రవీణ్ కుమార్

News

Posted on 2024-07-26 16:06:35

Share: Share


సిద్దిపేట ట్రాఫిక్  నూతన ఇన్స్పెక్టర్ (సీఐ)గా పదవీ బాధ్యతలు చేపట్టిన కె. ప్రవీణ్ కుమార్

డైలీ భారత్, సిద్దిపేట: సిద్దిపేట నూతన  ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన కె. ప్రవీణ్ కుమార్, ఈరోజు మర్యాదపూర్వకంగా పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్. నీ కలసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అభినందించి సిద్దిపేట పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ గురించి  ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రజలకు, ఆటో డ్రైవర్లకు, మోటార్ సైకిల్ వాహనదారులకు  ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మోటార్ సైకిల్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనదారులు తప్పకుండా సీట్ బెల్ట్ ధరించే విధంగా మోటివేట్ చేయాలని తెలిపారు. ఓవర్ స్పీడ్, త్రిబుల్ రైడింగ్ పై ప్రత్యేక నిఘా పెట్టి కేసులు నమోదు చేయాలని సూచించారు. కోమటి చెరువు, ఓల్డ్ బస్టాండ్, న్యూ బస్టాండ్ రంగనాయక సాగర్ ప్రాజెక్టు సిద్దిపేట పట్టణం చుట్టూ ఉన్న బైపాస్ రోడ్ లో  తదితర ప్రాంతాలలో బైక్ రేసింగ్ లపై నిఘా ఉంచాలన్నారు. రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేయాలని సూచించారు. ఉదయం సాయంత్రం విజిబుల్ పోలీసింగ్ విధులు నిర్వహించాలని తెలిపారు. సాయంత్రం సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు నిర్వహించాలని  మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కౌన్సిలింగ్ నిర్వహించాలని సూచించారు. మైనర్ డ్రైవింగ్ పై ప్రత్యేకంగా ఉంచాలన్నారు మైనర్ డ్రైవింగ్ చేసే  పిల్లలను పట్టుకొని వారి తల్లిదండ్రులను పిలిపించి  కౌన్సిలింగ్ అయిన తర్వాత కేసులు నమోదు చేయాలని సూచించారు. బుల్లెట్ సైలెన్సర్ మార్చిన వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచి కేసులు నమోదు చేయాలని తెలిపారు. సిద్దిపేట పట్టణంలో రద్దీగా ఉండే ప్రదేశాలలో  ప్రజలకు వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. పట్టణంలో రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి వివిధ డిపార్ట్మెంట్ లతో కలసి ప్రమాదాల నివారణకు  తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.

Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >