| Daily భారత్
Logo




పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

News

Posted on 2026-07-08 19:27:58

Share: Share


పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

క‌బ్జాల‌ను తొల‌గించి 6 గుంట‌ల భూమికి హైడ్రా ఫెన్సింగ్‌

డైలీ భారత్, హైదరాబాద్: పోలీసు స్టేష‌న్‌కు కేటాయించిన స్థ‌లాన్ని హైడ్రా కాపాడింది. రంగారెడ్డి జిల్లా, ఉప్పల్ మండలం, కొత్తపేట్ గ్రామంలోని సర్వే నంబర్లు 135, 136లో 6 గుంట‌ల స్థ‌లాన్ని చైతన్యపురి పోలీస్ స్టేషన్‌కు కేటాయించారు.  సర్వే నంబర్ 135లో 4 గుంటలు, సర్వే నంబర్ 136లో 2 గుంటలు కలిపి మొత్తం 6 గుంటల భూమిని పోలీసు స్టేష‌న్ ఏర్పాటుకు నిర్ణ‌యించారు. సర్వే నంబర్ 135లోని 4 గుంటల ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించుకుని షెడ్లు నిర్మించారు. ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించి పోలీసు స్టేష‌న్‌కు కేటాయించిన భూమిని కాపాడాల‌ని హైడ్రాను పోలీసు శాఖ కోరింది.  హైడ్రా అధికారులు క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించి క‌బ్జాల‌ను నిర్ధారించుకుంది.  బుధ‌వారం హైడ్రా బృందాలు రంగంలోకి దిగి షెడ్డుల‌ను తొల‌గించింది. ఆక్రమణలు మళ్లీ జరగకుండా సర్వే నంబర్లు 135, 136లోని మొత్తం 6 గుంటల స్థలానికి  హైడ్రా ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. పోలీసు స్టేష‌న్ కోసం కేటాయించిన భూమిగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేసింది.

Image 1

చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి

Posted On 2026-09-11 03:39:31

Readmore >
Image 1

నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-09-10 15:22:16

Readmore >
Image 1

కామారెడ్డిలో రైస్ మిల్లర్ల మహా ధర్నా విజయవంతం...

Posted On 2026-09-10 15:19:28

Readmore >
Image 1

CMRF ద్వారా లక్ష్మణ్‌కు రూ.19,000 ఆర్థిక సహాయం

Posted On 2026-09-10 09:43:29

Readmore >
Image 1

ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణం

Posted On 2026-09-10 07:03:46

Readmore >
Image 1

వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్

Posted On 2026-09-10 07:02:32

Readmore >
Image 1

వాటర్ బాటిలు అధిక ధర.. రూ.7 లక్షలు ఫైన్!

Posted On 2026-09-09 17:17:04

Readmore >
Image 1

కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్

Posted On 2026-09-09 14:45:53

Readmore >
Image 1

స్పీకర్ కు బీఆర్ఎస్ బహిరంగ క్షమాపణ చెప్పాలి

Posted On 2026-09-09 14:29:32

Readmore >
Image 1

దేమేకలాన్ పాఠశాలలో ఘనంగా కలోజి నారాయణరావు జయంతి వేడుకలు

Posted On 2026-09-09 14:28:15

Readmore >