| Daily భారత్
Logo




రాష్ట్ర బడ్జెట్ అన్ని వర్గాల ప్రజల అభివృద్దే లక్ష్యం

News

Posted on 2024-07-26 11:37:53

Share: Share


రాష్ట్ర బడ్జెట్ అన్ని వర్గాల ప్రజల అభివృద్దే లక్ష్యం

కాంగ్రెస్ సీనియర్ నేతలు పి. రఘు మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, బాలరాజ్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, బస్వం, శ్రీను నాయక్

షాద్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నేతలు

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర బడ్జెట్ పై హర్షం

రూ.2.91లక్షల కోట్లతో తెలంగాణ వార్షిక బడ్జెట్

వ్యవసాయ రంగానికి రూ.72 వేల 659 కోట్లు కేటాయింపు పై హర్షం

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: రాష్ట్ర బడ్జెట్ అన్ని  వర్గాల ప్రజల అభివృద్దే లక్ష్యంగా ఉందని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఆదివాసి గిరిజన సెల్ రాష్ట్ర నాయకులు పి. రఘు, పిసిసి సభ్యులు మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గండ్రతి బాలరాజ్ గౌడ్,   సీనియర్ నేతలు అగ్గనూరు బస్వం, తోకల దామోదర్ రెడ్డి, శ్రీను నాయక్ స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.. వీధి వ్యాపారులు మొదలు రైతులు పారిశ్రామికవేత్తల వరకు అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. వ్యవసాయ రంగాన్ని పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వ్యవసాయ రంగానికి రూ.72 వేల 659 కోట్లు కేటాయించడంతో రైతులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. వ్యవసాయం, సాగు, తాగునీటికి, విద్య , వైద్యం కాకుండా సబ్బండ వర్గాలకు  ఉపయోగపడే విధంగా రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారన్నారు. రూ.2.91లక్షల కోట్ల అంచనాతో పూర్తి స్థాయి బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టారన్నారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం బడ్జెట్‌లో 33వేల కోట్లను కేటాయించినట్టు తెలిపారు. ప్రతి పంచాయితీకి పంచాయితీ భవనం, బీటీ రోడ్లను ఏర్పాటు చేస్తామన్నారు.

గృహ‌జ్యోతితో పేదల ఇళ‌్లలో వెలుగులు 

200యూనిట్ల కంటే తక్కువ వినియోగించే అర్హులైన వారందరికి ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నామని, అర్హులైన వారికి జీరో బిల్లులు జారీ చేస్తున్నామని, ప్రభుత్వం బిల్లుల్ని డిస్కమ్‌లకు చెల్లిస్తున్నామని, మార్చి 1 నుంచి గృహ జ్యోతి 41.86లక్షల ఇళ్లకు రూ.583.05 కోట్లను సబ్సిడీగా చెల్లిస్తే బడ్జెట్‌లో రూ.2400కోట్లు కేటాయించినట్టు చెప్పారు.

ఉచిత బస్సు ప్రయాణం

ఉచిత బస్సు ప్రయాణంతో రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఉపయోగిస్తోందనీ పథకానికి అయ్యే ఖర్చును నెలవారీగా చెల్లిస్తోంది. మిలియన్ డాలర్ కార్పొరేషన్‌గా తెలంగాణ ఆర్టీసీ అవతరించింది. గ్యాస్‌ సిలిండర్‌తో తీవ్ర ఆర్థిక సమస్యగా మారితే,మహాలక్ష్మీ పథకంతో రూ.500కే వంట గ్యాస్ సిలిండర్‌ అందించామని, 30.06లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరిందని, బడ్జెట్‌లో రూ.723కోట్లు కేటాయిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే రూ.200కోట్లు కేటాయించినట్టు చెప్పారు.

విద్యారంగానికి 21వేల కోట్ల కేటాయింపు

తెలంగాణ విద్యా రంగానికి రూ.21,292కోట్ల రుపాయలు కేటాయించారని వారు పేర్కొన్నారు.

గతంలో అనర్హులకు రుణమాఫీ

గత ప్రభుత్వంలో అనర్హులకు మాత్రమే రుణమాఫీ చేశారని, దాని వల్ల ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం అయ్యిందని, అర్హులకు మాత్రమే అందించాలనే లక్ష్యంతో రైతు బంధు స్థానంలో రైతు భరోసా రూపంలో ఏటా రూ.15వేలు చెల్లిస్తామని, దాని అమలుకు క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. కమిటీ అన్ని వర్గాల అభిప్రాయాలను సేకరించి వాటిని సభలో చర్చించి విధివిధానాలను ఖరారు చేస్తామని ప్రకటించారు.

రైతులకు రూ.2లక్షల రుణమాఫీకి కాంగ్రెస్‌ కట్టుబడి ఉన్నామని, వరంగల్ డిక్లరేషన్‌లో రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని, రుణమాఫీ నిధులు సమీకరించాలనే సంకల్ప బలం తమకు ఉందన్నారు. 2014-18 మధ్య నాలుగు విడతల్లో రూ.లక్ష మాత్రమే విడుదల చేశారని, దాని వల్ల వడ్డీ భారం పెరిగిందన్నారు. రెండోసారి లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి ఎన్నికల ముందు కొద్దిపాటి రుణాలు మాత్రమే మాఫీ చేశారన్నారు. దీని వల్ల రైతులపై తీవ్రమైన భారం పడిందన్నారు. అరకొర రుణమాఫీ కాకుండా రైతులకు ఒకేసారి రూ.31వేల కోట్లను రుణమాఫీ చేశామని చెప్పారు. కాంగ్రెస్‌ చిత్తశుద్దిని శంకిస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. పొదుపు, ప్రణాళికతో, రెండు లక్షల కోట్ల రుణమాఫీ అవసరమైన నిధులు సమీకరిస్తున్నామని, 11.34లక్ష మంది రైతులకు జూలై 18న రూ.6వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. కాంగ్రెస్ హామీ ఇస్తే అది శిలాశాసనమేనని చెప్పారు.

వార్షిక బడ్జెట్ పై హర్షం

తెలంగాణలో 2024-25 ఆర్థికసంవత్సరానికి రూ.2.91లక్షల కోట్ల బడ్జెట్‌ను అందులో రెవిన్యూ వ్యయం రూ.2.20లక్షల కోట్లు, మూల ధన వ్యయం రూ.33,487కోట్లుగా పేర్కొన్నారు. తెలంగాణలో తలసరి ఆదాయం అధికంగా ఉన్నా, తలసరి ఆదాయ స్థాయిలో జిల్లా స్థాయిల్లో తీవ్ర వ్యత్యాసం ఉందని, రంగారెడ్డి రూ.9.62లక్షలు ఉంటే వికారాబాద్‌లో లక్షన్నర మాత్రమే ఉందన్నారు.

హామీలు నెరవేరుస్తున్నాం

ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కు సిలిండర్‌, రైతు రుణ మాఫీ వంటి ఎన్నికల హామీలను ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అమలు చేశామని వారు చెప్పారు.

ఆర్నెల్లలో 35వేల కోట్ల అప్పులు

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 35వేల కోట్ల అప్పులు చేస్తే 42వేల కోట్ల అప్పులు తీర్చామని రఘు చెప్పారు. అదే సమయంలో ఎన్నికల హామీలను నెరవేర్చడానికి రూ.34వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. పదేళ్ల పాలనతో కుంటు పడిన ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టాల్సిన సమస్య తమకు ఎదురైందని ఉద్యోగులు, పెన్షనర్లకు సకాలంలో జీతాలు చెల్లించలేని స్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉందన్నారు.


 *సాగునీటి నిర్మాణాల్లో అక్రమాలు* 


తప్పుడు విధానాలతో నాణ్యత లేని నిర్మాణాలతో సాగునీటి ప్రాజెక్టులు ఆశించిన ప్రయోజనాలను ఇవ్వలేకపోయాయని చెప్పారు. రైతులకు ప్రయోజనం కల్పించలేదని, సాగునీటి రంగంలో దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. గత ప్రభుత్వంలో సమకూరిన ఆదాయానికి, బకాయిలకు, ఖర్చులకు పొంతన లేకుండా పోయిందన్నారు. ప్రణాళిక లేకుండా నడపడం, సొంత జాగీరులా ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడంతో వారసత్వంగా సమస్యలు అందుకున్నామన్నారు. విభజన నాటికి ఆర్థిక పరిపుష్టితో ఉన్న రాష్ట్రంలో ఉద్యోగుల వేతనాలను కూడా చెల్లించలేని స్థితి చేరిందన్నారు..

Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >