| Daily భారత్
Logo




రెండు గంజాయి కేసులో ముగ్గురు నిందుతుల అరెస్ట్, రిమాండ్

News

Posted on 2024-07-24 13:43:24

Share: Share


రెండు గంజాయి కేసులో ముగ్గురు నిందుతుల అరెస్ట్, రిమాండ్

200 గ్రాముల గంజాయి,ఒక గంజాయి మొక్క స్వాధీనం.

సిరిసిల్ల రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఈ రోజు ఎస్.ఐ సుధాకర్ తో కలసి వివరాలు వెల్లడించిన సి.ఐ మొగిలి.

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఇల్లంతకుంట మండలానికి చెందిన వివేక్, వేణు అనే ఇద్దరు వ్యక్తులు గంజాయి తాగడానికి అలవాటు పడి తంగాళపల్లి గ్రామానికి చెందిన క్రాంతి వద్ద గంజాయి కొనుగోలు చేసి అట్టి గంజాయి తాగుతూ మిగిలిన గంజాయి అమ్మడానికి వివేక్, వేణు ఇద్దరు వ్యక్తులు తంగాళపల్లి మండలంలోని అంబగుడి వద్దకి వస్తున్నారన్న నమ్మదగిన సమాచారం మేరకు ఇద్దరు వ్యక్తులను నిన్నటి రోజున మధ్యాహ్నం సమయంలో అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 200 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకొని వారిని విచారించగా వారు తంగాళపల్లి గ్రామానికి చెందిన క్రాంతి వద్ద వారికి అవసరం ఉన్నప్పుడల్లా కొనుగోలు చేసి తగగా మిగిలిన గంజాయి అమ్ముకుంటున్నాం అని చెప్పగా , తంగాళపల్లి ఎస్.ఐ సుధాకర్ తన సిబ్బందితో నిన్నటి రోజున మధ్యాహ్నం సమయంలో  క్రాంతి ఇంట్లో తనిఖీ చేపట్టి అక్రమంగా సాగు చేస్తున్న గంజాయి మొక్క స్వాధీనం చేసుకొని ఈ రోజు ముగ్గురు గంజాయి నిందుతులను రిమాండ్ కి తరలించినట్లు సిరిసిల్ల రూరల్ సి.ఐ మొగిలి తెలిపారు.

నిందుతుల వివరాలు.

1.జక్కనపల్లి వివేక్ , s/o పోచమళ్ళు,19y, r/o మైలారం గ్రామం ,గన్నేరువరం మండలం, ప్రస్తుతం ముస్కానిపేట,ఇల్లంతకుంట మండలం.

2.అంతటి వేణు, s/o పర్శరాములు,21y, r/o ఇల్లంతకుంట.

3.క్రాంతి, తంగాళపల్లి గ్రామం.


ప్రజలు ఎవరైనా గంజాయి కి సంబంధించిన సమాచారం డయల్100 లేదా టాస్క్ఫోర్స్ సి.ఐ ఫోన్ నెంబర్ 87126 56392 కి  సమాచారం అందించగలరని, యువత డ్రగ్స్ భారిన పడి బంగారు భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించి అక్రమ గంజాయి  రవాణాపై జిల్లాలో ప్రత్యేక దృష్టి సారించి ఉక్కుపాదం మోపుతున్నారని, 2024 సంవత్సరంలో ఈ రోజు వరకు జిల్లాలో 47 కేసులలో 121 మందిని అదుపులోకి 31.80 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.

Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >