Posted on 2024-07-24 13:00:15
రాష్ట్రంలో ఐటీ రంగాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన గొప్ప నాయకుడు కల్వకుంట్ల తారక రామారావు
షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే ఆంజయ్య యాదవ్
డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని ఐటి రంగంలో అభివృద్ధి పథంలో నడిపించిన గొప్ప నాయకుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు అని మాజీ ఎమ్మెల్యే ఆంజయ్య యాదవ్ అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలల్లో ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులతో కలిసి కేకను కట్ చేసి ఘనంగా నిర్వహించారు.
అనంతరం మొక్కలు నాటి నీళ్ళు పోశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడం జరిగిందని కొనియాడారు. షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్, పండ్లు పంపిణీ చేశారు. అదే విధంగా కొత్తూర్ కస్తూర్భా బాలికల పాఠశాలలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటడం జరిగింది. షాద్ నగర్ బై పాస్ లో గల ఎఫ్.సి.యన్ అనాథ ఆశ్రమంలో బీఆర్ఎస్ ఎన్.ఆర్.ఐ నాయకులు పొట్టి శ్రీనివాస్ ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >