| Daily భారత్
Logo




మెట్రో పిల్లర్‌ను ఢీకొన్న ఎలక్ట్రిక్ బస్సు

News

Posted on 2024-07-22 21:25:50

Share: Share


మెట్రో పిల్లర్‌ను ఢీకొన్న ఎలక్ట్రిక్ బస్సు

ఢిల్లీలో ఓ బస్సు బీభత్సం మెట్రో పిల్లర్‌ను ఢీకొన్న ఎలక్ట్రిక్ బస్సు.. ఒకరు మృతి.

డైలీ భారత్, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓ బస్సు బీభత్సం సృష్టించింది. ఎలక్ట్రిక్ బస్సు మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టడంతో ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా.. మరో 24 మందికి గాయాలయ్యాయి. ఢిల్లీలోని పంజాబీ బాగ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

పంజాబీ బాగ్‌లోని రోహ్‌తక్‌ రోడ్డులోని శివాజీ పార్క్‌ సమీపంలో ఉదయం ఈ ప్రమాదం జరిగినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. మెట్రో పిల్లర్‌ను ఎలక్ట్రిక్ బస్సు ఢీకొనడంతో 45 ఏళ్ల మహిళ మృతి చెందగా, మరో 24 మంది ప్రయాణికులు గాయపడ్డారని వెల్లడించారు. బస్సు ప్రమాదానికి సంబంధించి ఉదయం 7.42 గంటలకు పంజాబీ బాగ్ పోలీస్ స్టేషన్‌కు పీసీఆర్ కాల్ వచ్చిందని డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ విచిత్ర వీర్ తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు మంగోల్‌పురి-ఆనంద్ విహార్ మధ్య నడుస్తున్న ఎలక్ట్రిక్ బస్సు ఆ ప్రాంతంలోని మెట్రో పిల్లర్‌పైకి దూసుకెళ్లినట్లు గుర్తించారు. బస్సు డ్రైవర్‌ సడన్‌గా బ్రేక్‌ వేయడంతో వెనుక నుంచి ఆటో రిక్షా ఢీకొట్టింది.

ప్రమాదంలో మహిళ మృతి చెందగా, 55 ఏళ్ల వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. గాయపడిన 24 మంది ప్రయాణికుల్లో 14 మందిని మహారాజా అగ్రసేన్ ఆసుపత్రికి, మరో 10 మందిని ఆచార్య భిక్షు ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

నిర్లక్ష్యంతో ర్యాష్ డ్రైవింగ్, ఒకరి మరణానికి కారణమైనందుకు భారతీయ న్యాయ సంహిత కింద కేసు నమోదు చేశామని, క్రైమ్ టీమ్‌ను సంఘటనా స్థలానికి పిలిపించి, ఫోరెన్సిక్ శాంపిల్స్ తీసుకుంటున్నామని పోలీసు అధికారి తెలిపారు. బస్సులో మెకానికల్ తనిఖీలు కూడా జరుగుతున్నాయని అధికారి తెలిపారు.

Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న మారని మందుబాబులు

Posted On 2025-12-07 19:45:50

Readmore >
Image 1

చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి

Posted On 2025-12-07 18:39:01

Readmore >
Image 1

ఎస్ఎస్టీ చెక్ పోస్ట్ ను పరిశీలించిన ఇంచార్జి కలెక్టర్

Posted On 2025-12-07 18:35:52

Readmore >
Image 1

ఆయా దినపత్రికల స్టాపర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

Posted On 2025-12-07 17:31:39

Readmore >
Image 1

పద్మశాలి విద్యార్థులు ఉన్నత విద్యలో ముందంజలో ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు

Posted On 2025-12-07 17:30:34

Readmore >
Image 1

కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు

Posted On 2025-12-07 14:24:59

Readmore >
Image 1

పర్యాటక రాష్ట్రం గోవాలో భారీ అగ్నిప్రమాదం

Posted On 2025-12-07 08:40:10

Readmore >
Image 1

టెన్త్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేత

Posted On 2025-12-06 17:39:53

Readmore >
Image 1

హోంగార్డ్స్ 63 వ రైసింగ్ డే కార్యక్రమంలో పాల్గొన సిపి సాయి చైతన్య

Posted On 2025-12-06 16:17:59

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు

Posted On 2025-12-06 16:16:40

Readmore >