Posted on 2024-07-21 18:56:43
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: కాంగ్రెస్ పార్టీది ఫామ్ హౌస్ పాలన కాదని, ముఖ్యమంత్రితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజా పాలన కొనసాగిస్తున్నారని పేర్కొన్నా కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి
నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్,కేటీఆర్, హరీష్ రావులపై ఘాటు వ్యాఖ్యలు చేసినా_ కేకే
మాటమీద నిలబడి ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందని,గత ప్రభుత్వం చేసిన అప్పులకు మిత్తులు కడుతున్నం
మొదటి విడత 32 వేల కోట్ల రుణమాఫీ చేసిందన్నారు.
రైతును రాజుగా చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని,మిగతా 2 విడతల్లో పూర్తిస్థాయి రెండు లక్షల రుణమాఫీని ప్రభుత్వం చేసి తీరుతుంది
కేసీఆర్ లాగా ఫామ్ హౌస్ లో ఉండి నిర్ణయాలు తీసుకోవడంకాదు, మంత్రులందరూ కమిటీగా ఏర్పడి రుణమాఫీ విధివిధానాలను రూపొందించారు
రైతుబంధు పథకం పై కూడా ప్రజాభిప్రాయాలు సేకరిస్తున్నం..రుణమాఫీపై మాట్లాడే అర్హత కేసీఆర్, కేటీఆర్,హరీష్ రావులకు లేదని, పీఠాలు కదులుతున్నాయనే, పిచ్చి పట్టినట్లు తలా తోకా లేని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
రుణమాఫీ చెయ్యకపోతే రాజీనామా చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే, రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న హరీష్ రావు ఇప్పుడు ఆరుగ్యారెంటీల పేరిట మాట మారుస్తున్నాడు
నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగం నోటిఫికేషన్ ప్రభుత్వం ఇచ్చింది, ఇచ్చిన నోటిఫికేషన్లు రద్దు చేయాలని, కొంతమందిని రెచ్చగొడుతూ రాజకీయ లబ్ధి కోసం దొంగ దీక్షలు కొందరు నేతలు చేపిస్తున్నారు
సోనియా గాంధీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నం...రాహుల్ గాంధీ ఇచ్చిన రుణమాఫి అమలు చేసినం.
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న హామీల అమలను చూసి ఓర్వలేక టిఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.గత బీఆర్ఎస్ అవినీతి అరాచక పరిపాలనలో ప్రజలు ఇబ్బంది పడ్డారు.
6 గారెంటిలని నెరవేర్చే దిశగా రేవంత్ రెడ్డి నాయత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుంది.
తెలంగాణ అక్క చెల్లెలకు మాట ఇచ్చిన విధంగా సబ్సిడీపై గ్యాస్ ఇస్తూ రు.600 కోట్లను కడుతున్నం.
గృహజ్యోతి పథకంలో రూ.200 కోట్ల ను ఇస్తున్నాం
పార్టీ భవిష్యత్ ను పక్కకు పెట్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి సోనియా గాంధీ
రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి ప్రజల నెత్తిపై అప్పు బారాన్ని మోపిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వంది
ఎంత ఆర్థిక భారమైన రైతులను ఆదుకొనే ఉద్దేశ్యంతో రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది
తెలంగాణ అక్క చెల్లెలకు మాట ఇచ్చిన విధంగా సబ్సిడీపై గ్యాస్ ఇస్తూ రు.600 కోట్లను కడుతున్నం.గృహజ్యోతి పథకంలో రూ.200 కోట్ల ను ఇస్తున్నాం.పార్టీ భవిష్యత్ ను పక్కకు పెట్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి సోనియా గాంధీ,రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి ప్రజల నెత్తిపై అప్పు బారాన్ని మోపిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వంది,ఎంత ఆర్థిక భారమైన రైతులను ఆదుకొనే ఉద్దేశ్యంతో రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది,సోషల్ మీడియాలో విష ప్రచారం చేసుడు కాదు..
నేషనల్ డ్యాం అథారిటీ అధికారులే కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక లోపాలు ఉన్నాయని చెప్పారు.జ్యుడీషియల్ కమిషన్ ముందు హాజరవ్వడానికి కేసీఆర్కు అభ్యంతరమైంది.
కమిషన్ ముందు హాజరు కాకుండా సిబిఐ ఎంక్వయిరీ వేయమనడం వెనక మతలబు ఎంది?. బిజెపి,బీఆర్ఎస్ చీకటి దోస్తులే అనడానికి ఇది కారణం,కవితను బయటకు తీసుకురవడానికి బావ బమ్మర్డులు డిల్లీకి పోయి జరిపిన మంతనాలు అందరికీ తెలిసిందే.
హరీష్ రావు మంచోడు అంటున్న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్..కేటీఆర్ ను కూడా అనొచ్చు కదా?
దీన్ని బట్టే అర్థమవుతోంది బీజేపీ కి,బీఆర్ఎస్ దోస్తానా అని ప్రజలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వంపై పూర్తి విశ్వాసం ఉంది ప్రతిపక్షాల కుట్ర నమ్మే వారు లేరు.
ఈ పాత్రికేయ సమావేశం లో నియోజకవర్గ ఇంచార్జి కెకె మహేందర్ రెడ్డి తో పాటు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్,తంగాళ్ళపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ జె టోనీ,జిల్లా చేనేత అధ్యక్షులు గోనె ఎల్లప్ప,ఎస్సి సెల్ జిల్లా అధ్యక్షులు బాలరాజు,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుర దేవరాజు,జిల్లా నాయకులు గడ్డం నర్సయ్య,వైద్య శివ ప్రసాద్,కత్తెర దేవదాస్,మ్యాన ప్రసాద్,మున్సిపల్ కాన్సిలర్ డాక్టర్ రవి,మాజీ ఎంపీటీసీ బైరి నేనీ రాము,బిమావరం శ్రీనివాస్,శంకర్,మిరాల శ్రీనివాస్,రాపెళ్లి కళ్యాణ్,కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
MMTS రైళ్ళల్లో ఫ్రీ జర్నీ అంశాన్ని కొట్టిపారేసిన దక్షిణ మధ్య రైల్వే
Posted On 2026-04-20 07:46:07
Readmore >
శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం.... హల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి ఆత్మహత్య
Posted On 2026-04-19 22:22:58
Readmore >