Posted on 2024-07-21 18:25:27
డైలీ భారత్, ఆంధ్రప్రదేశ్ డెస్క్: నిడదవోలులో దారుణ ఘటన చోటుచేసుకుంది అనుమానంతో భార్యను దారుణంగా కత్తెరతో పొడిచి హత్య చేశాడు ఓ భర్త
నిడదవోలు మండలం శెట్టిపేట గ్రామంలో భార్యపై అనుమానంతో మిషన్ కత్తెరతో భార్య నవ్యను హత్య చేసినభర్త
నిడదవోలు మండలం శెట్టిపేట గ్రామానికి చెందిన కురసాల చిరంజీవి తాపీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి 11 సంవత్సరాల క్రితం పెరవలి మండలం అన్నవరపాడు గ్రామానికి చెందిన నవ్యతో వివాహం అయింది. వీరికి ముగ్గురు అమ్మాయిలు. ఐతే గత కొన్ని రోజులుగా చిరంజీవి భార్య వేరే వ్యక్తి తో సన్నిహితంగా ఉంటుంది అన్న అనుమానం పెంచుకున్నాడు.
గత రాత్రి ఈ విషయం పై గొడవ పడి భార్య నవ్యను భర్త చిరంజీవి హత్య చేశాడని, నవ్య తండ్రి వెలగం శ్రీను నిడదవోలు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
ఈ సంఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
MMTS రైళ్ళల్లో ఫ్రీ జర్నీ అంశాన్ని కొట్టిపారేసిన దక్షిణ మధ్య రైల్వే
Posted On 2026-04-20 07:46:07
Readmore >
శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం.... హల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి ఆత్మహత్య
Posted On 2026-04-19 22:22:58
Readmore >