Posted on 2024-07-20 11:45:39
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఈరోజు భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణ కేంద్రంలో పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ మనుగడ కోసం ఉచిత విద్యుత్ కావాలని, కార్మికులకు ఇవ్వవలసిన 10% యారన్ సబ్సిడీ వెంటనే ఇవ్వాలని, వర్కర్ టు ఓనర్ పథకాన్ని వెంబడి అమలు చేయాలని, పాత పవర్లూమ్ పరిశ్రమకు సంబంధించి పాత బకాయిలు కట్టాలని ఇచ్చిన బిల్లులు వెంటనే మాఫీ చేయాలని, బతుకమ్మ చీరలకు సంబంధించిన బకాయలు వెంటనే ఏక మొత్తంలో ఒకటేసారి చెల్లించాలని, సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు కొత్త ఆర్డర్లు ఇవ్వాలని దీక్ష చేయడం జరుగుతుంది అదేవిధంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో ఉంది ఈ సంక్షోభానికి బతుకమ్మ చీరాల బకాయిలు ఇవ్వకపోవడం వస్త్ర పరిశ్రమ కార్మికులకు ఉపాధి లేక కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరపున సీఎం రేవంత్ రెడ్డి ని ఉచిత విద్యుత్తు వెంటనే అమలు చేయాలని వస్త్ర పరిశ్రమ కార్మికులకు ఉపాధి కల్పించాలని అదేవిధంగా కార్మికులు ఆత్మహత్య చేసుకున్న వారికి ప్రభుత్వం వెంటనే తక్షణ పరిహారం చెల్లించాలని కోరుతున్నాము.
ఈ దీక్షా కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పార్లమెంట్ కో కన్వీనర్ ఆడెపు రవీందర్, కొండ నరేష్, గాజుల సదానందం కోడం ఆనంద్ బాబు, మోర రవి, మెరుగు శ్రీనివాస్, కోడం రవి, కోడం శ్రీనివాస్, సుంచు ప్రకాష్, తౌటు రాజలింగం, వడ్నాల శ్రీకాంత్, వేముల రజనీకాంత్, దీక్షా కార్యక్రమాన్ని ప్రారంభించిన బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి, గాజుల వేణు, దుమాల శ్రీకాంత్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు మరియు బిజెపి నాయకులు, కార్యకర్తలు కార్మికులు పాల్గొన్నారు
మరియు ఈ దీక్ష కార్యక్రమానికి సంఘీభావం తెలపడానికి సిరిసిల్ల చేనేత వస్త్ర వ్యాపార సంఘం, పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం, కాటన్ ఉత్పత్తిదారుల సంఘం, ఆసాముల సంఘం, డయింగ్ ఆసాముల సంఘం ఈ దీక్షా కార్యక్రమానికి సంఘీభావం తెలిపినారు
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >