Posted on 2024-07-17 20:08:53
ఫరూక్ నగర్ లో మొహరం వేడుకలకు హాజరైన మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: సమాజం కోసం తమ ప్రాణాలను సైతం పనంగా పెట్టి యుద్ధంలో అమరవీరులైన మహావీరులను స్మరించుకోవడమే వారి త్యాగాలను గుర్తించుకోవడమే మొహరం అని మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం షాద్ నగర్ పట్టణంలోని ఫరూక్ నగర్ గుండుగేరిలో స్థానిక కౌన్సిలర్లు కానుగు అనంతయ్య, బచ్చలి నరసింహ నిర్వహించిన మొహరం వేడుకలకు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి స్థానిక మున్సిపల్ చైర్మన్ నరేందర్ వైస్ చైర్మన్ నటరాజ్ తదితర నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురిని స్థానికులు సన్మానించారు. అనంతరం ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ
మహమ్మదీయుల ప్రధాన పర్వ దినాలలో మొహరం ముఖ్యమైనదనీ హసన్, హుస్సేన్ వీరుల స్మారకార్థం శోకతప్త హృదయాలతో జరుపుకునే కార్యక్రమమే పీర్ల పండుగ మొహరం అన్నారు. మొహరం పండుగనే పీర్ల పండుగ అని కూడ పల్లెల్లో అంటారని, "పీర్ " అంటే మహాత్ములు, ధర్మనిర్దేశికులు అని అర్థం అన్నారు. ధర్మయుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వీరులకు ప్రతీకగా హస్తాకృతి గలిగిన రూపాలను తయారు చేసి వాటిని అలంకరించి, ఊరేగించి, పూజించే వాటిని "పీర్లు" అని పిలుస్తారని పేర్కొన్నారు. వారి ప్రాణ త్యాగాలను స్పందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వారి ధైర్యం త్యాగం ప్రపంచం ఎన్నటికీ మరువదని అన్నారు. వాస్తవానికి ఇది పండుగ కాదని ఎంతో బాధతో నిర్వహించుకునే స్మరించుకునే నివాళి వేడుకని నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. గ్రామాలలో హిందూ ముస్లింలు సోదర భావంతో కలిసి మెలిసి పీర్ల పండుగ జరుపుకుంటారని పేర్కొన్నారు. జానంపేటలో ఎంతో చారిత్రాత్మకంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం హిందూ ముస్లిం సోదర భావానికి అడ్డం పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజు, కడెంపల్లి శ్రీనివాస్, తాండ్ర వెంకట్ రెడ్డి ,వార్డ్ కౌన్సిలర్ కానుగ అనంతయ్య, బచ్చల నర్సిములు, బి ఆర్ ఎస్ నాయకులు చెట్ల నర్సిములు, పిల్లి శేఖర్, జూపల్లి శంకర్,బి ఆర్ ఎస్ మండల్ ప్రెసిడెంట్ లక్ష్మణ్, మామిడిపల్లి ఎంపిటిసి మాదవి రవీందర్, మంగ శ్రీశైలం, మల్లేష్, నరేష్ శ్రీను,చెరుకు శివ తదితరులు పాల్గొన్నారు..
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >