| Daily భారత్
Logo




కేటీఆర్ పిలిచినా రాని 14మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు?

News

Posted on 2024-07-16 21:36:33

Share: Share


కేటీఆర్ పిలిచినా రాని 14మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు?

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా:ఎప్పుడు ఏ ఎమ్మెల్యే పార్టీ మారుతారో… ఏ నాయ‌కుడు పార్టీని వీడార‌ని వార్త వినిపిస్తుందో అన్న టెన్ష‌న్ లో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి మ‌రిన్ని షాకులు త‌గిలేలా క‌న‌ప‌డుతున్నాయి. అసెంబ్లీ మొద‌ల‌య్యే లోపే విలీన ప్ర‌క్రియ పూర్తిచేస్తామంటున్న కాంగ్రెస్ వ్యాఖ్య‌ల‌కు బ‌లం చేకూర్చేలా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరు క‌న‌ప‌డుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌కు ప్రోటోకాల్ ఇష్యూ, ఎమ్మెల్యేల ఫిరాయింపులపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఎమ్మెల్యేలంతా స్పీక‌ర్ ను క‌ల‌వాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. హ‌రీష్ రావు-కేటీఆర్ ల ఆధ్వ‌ర్యంలో స్పీక‌ర్ ను క‌ల‌బోతున్నందున‌… అంద‌రూ ఈ మీటింగ్ రావాల‌ని స‌మాచారం ఇచ్చారు. కానీ, బీఆర్ఎస్ పిలుపుకు 14మంది ఎమ్మెల్యేలు డుమ్మాకొట్టారు. కేసీఆర్ ను తీసేస్తే… 13మంది ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదు అన్న చ‌ర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్ కు 38మంది ఎమ్మెల్యేలు ఉండ‌గా… అందులో 10మంది కాంగ్రెస్ గూటికి చేరారు. మిగిలిన 28మందిలో కేవ‌లం 14మందే స్పీక‌ర్ ను క‌లిసే మీటింగ్ వ‌చ్చారు. తాజాగా డుమ్మా కొట్టిన వారిలో మాజీ మంత్రి మ‌ల్లారెడ్డి ప‌లువురు ఎమ్మెల్యేలున్నారు. డుమ్మాకొట్టిన వారంతా పార్టీ మార‌బోతున్నారా…? వ‌చ్చిన వారిలోనూ ఎవ‌రెవ‌రు ఉంటారో… అన్న చ‌ర్చ జోరుగా సాగుతోంది.

Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >