Posted on 2024-07-16 17:17:48
డైలీ భారత్, హైదరాబాద్: మూడేళ్లుగా పెండింగ్లో ఉన్న పీ రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయించాలని సిరిసిల్ల డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు కోరారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్లో ఎమ్మెల్యే కేటీఆర్ను కలిసి విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. ఆర్థిక లేమితో అల్లాడుతున్న కళాశాలల యాజమాన్యాల పరిస్థితిని అర్ధం చేసుకుని అసెంబ్లీ వేదికగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన కేటీఆర్ 2019లో తమ ప్రభుత్వం అధికారంలో వచ్చే నాటికి రూ.1800కోట్లు పీ రీయింబర్స్మెంట్ నిధులు పెండింగ్లో ఉన్నాయని, అవన్నీ సమయానుకూలంగా చెల్లించిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పెండింగ్లో ఉన్న పీజు బకాయలు చెల్లించాలని డిమాండ్ చేసారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో కాలేజీ యాజమాన్యాలకు రావాల్సిన రీయింబర్స్మెంట్ నిధుల విషయంలో కొట్లాడి సాధించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డిగ్రీ కళాశాలల నిర్వాహకులు గుగ్గిళ్ల జగన్ గౌడ్, గెంట్యాల భూమేశ్, కొలనూరు శేఖర్ రెడ్డి, రేశం శ్రీకాంత్, మారం వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >