| Daily భారత్
Logo




హెచ్ పీ వీ వ్యాక్సిన్ లక్ష్యం పూర్తి చేయాలి

News

Posted on 2026-04-26 04:21:25

Share: Share


హెచ్ పీ వీ వ్యాక్సిన్ లక్ష్యం పూర్తి చేయాలి

టీబీ, ఎన్ సీ డీ పరీక్షలు ప్రణాళిక ప్రకారం చేయాలి.

పీ హెచ్ సీ, అంగన్వాడీ భవనాలు, టాయిలెట్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి.

చైల్డ్ సేఫ్టీ వీక్ ను పకడ్బందీగా నిర్వహించాలి.

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్.

వైద్యఆరోగ్యశాఖ, జిల్లా సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ఐడీఓసీ జిల్లా కలెక్టర్ సమీక్ష.

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల : ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో హెచ్ పీ వీ వ్యాక్సినేషన్ లక్ష్యం మేరకు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. హెచ్ పీ వీ వ్యాక్సినేషన్, టీబీ నిర్ధారణ, ఎన్ సీ డీ పరీక్షలు, అంగన్వాడి, పీ హెచ్ సీ భవనాలు, టాయిలెట్ల నిర్మాణాలు చైల్డ్ సేఫ్టీ వీక్, ఎంటీపీ ఆక్ట్ తదితర అంశాలపై వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్ శాఖ, జిల్లా సంక్షేమ శాఖ అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. జిల్లాలో హెచ్ పీ వీ వ్యాక్సినేషన్ లక్ష్యం మేరకు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సిరిసిల్ల, ఏరియా ఆసుపత్రి వేములవాడ, ఇతర అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో  పూర్తి చేయాలని, అంగన్వాడీల సహాయంతో బాలికలకు వ్యాక్సిన్ వేయాలని ఆదేశించారు. టీబీ ముక్త్ భారత్ లో భాగంగా 100 రోజుల కార్యాచరణ కింద జిల్లాలోని 42 గ్రామాల్లో మొబైల్ ఎక్స్ రే యంత్రం ద్వారా ఇప్పటి వరకు 24 గ్రామాల్లో టీబీ నిర్ధారణ పరీక్షలు పూర్తి చేశారని, మిగతా గ్రామాల్లో ప్రణాళిక ప్రకారం పరీక్షలు పూర్తి చేయాలని ఆదేశించారు. టీబీ కేసులు నమోదయ్యే గ్రామాల్లో పారిశుధ్య పనులు ప్రత్యేకంగా చేయించాలని, టీబీ బాధితులపై ప్రత్యేక శ్రద్ధ వహించి మందులు ఇవ్వాలని పోషకాహారం తీసుకునేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. 

భవన నిర్మాణ పనులు వేగం పెంచాలి

పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, హెల్త్ సబ్ సెంటర్ అంగన్వాడీ భవనాలు అంగన్వాడీల్లో టాయిలెట్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రణాళిక ప్రకారం పనుల్లో వేగం పెంచి జూన్ లోగా పూర్తి చేయాలని సూచించారు. డీసీ హెచ్ ఎస్ ఆధ్వర్యంలో జిల్లాలోని వేములవాడ ఏరియా ఆసుపత్రి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట సీ హెచ్ సీ లో ఓపీ నమోదు, ఇన్ పేషెంట్ ఇతర అంశాలపై ఆరా తీసి వైద్యులకు పలు సూచనలు చేశారు. 

ఎంటీపీ యాక్ట్ పై వైద్యులు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో ప్రభుత్వ ఆదేశాల మేరకు చైల్డ్ సేఫ్టీ వీక్ ఈ నెల 27వ తేదీ నుంచి నిర్వహించాలని, షెడ్యూల్ కు అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వ, సంక్షేమ శాఖ పథకాలు, సేవలపై అవగాహన కల్పించాలని సూచించారు. మిషన్ వాత్సల్య పై అంగన్వాడీ టీచర్లు, ఆయాలు అవగాహన కల్పించి అర్హులైన వారి వివరాలు సేకరించి జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయానికి పంపించాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలకు పంపిన ఆర్ఓ ప్లాంట్లు బిగించి వినియోగంలోకి తీసుకురావాలని, ప్లేయింగ్ మెటీరియల్ పిల్లలు ఆడుకునేలా చూడాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో పంచాయతీ రాజ్ ఎస్ఈ గిరీష్ బాబు, జిల్లా వైద్యాధికారి రజిత, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, జీ జీ హెచ్ సూపరింటెండెంట్ ప్రవీణ్ కుమార్, డీసీ హెచ్ ఎస్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >
Image 1

100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు

Posted On 2026-09-04 12:11:03

Readmore >
Image 1

హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్

Posted On 2026-09-04 12:09:51

Readmore >