| Daily భారత్
Logo




కామారెడ్డి : ఘనంగా శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి జన్మదిన వేడుకలు

News

Posted on 2026-04-26 14:46:27

Share: Share


కామారెడ్డి : ఘనంగా శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి జన్మదిన వేడుకలు

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలోని సిరిసిల్ల రోడ్డులో ఘనంగా నిర్వహించిన శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి జన్మదిన వేడుకలు మరియు శివపార్వతుల కల్యాణ మహోత్సవం కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య జరిగింది.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్  ముఖ్య అతిథిగా హాజరై నారు,

కార్యక్రమంలో పాల్గొన్న షబ్బీర్ అలీ  ముందుగా వాసవి మాత ఆలయంలో శివపార్వతుల కల్యాణ మహోత్సవంలో భాగస్వామ్యం అయ్యారు. 

అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో షబ్బీర్ ఆలీ  మాట్లాడుతూ,

వాసవి మాత వైశ్య సమాజానికి ఆరాధ్య దైవమని, ఆమె త్యాగం, ధర్మం, సమానత్వానికి ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైశ్యుల ఆత్మగౌరవాన్ని మరింత పెంపొందించేందుకు కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  పరమేశ్వరి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించడం ఎంతో గర్వకారణమని అన్నారు.

 ఈ నిర్ణయం ద్వారా వైశ్య సమాజానికి తగిన గౌరవం లభిస్తుందని పేర్కొన్నారు.

ఇక రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం సమానంగా కృషి చేస్తోందని, ప్రతి సమాజానికి తమ సంస్కృతి, సంప్రదాయాలకు గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తోందని షబ్బీర్ అలీ  స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, డిసిసి మాజీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షులు పండ్ల రాజు, గూడెం శ్రీనివాస్ రెడ్డి , ఐరేనీ  సందీప్, దేవరాజ గౌడ్, గంప ప్రసాద్,దివ్య పాత, వలిపిశెట్టి లక్ష్మీ రాజ్యం, భాస్కర్. తిరుమల గౌడ్, ఐరనీ నరసయ్య, ఇంద్రసేనారెడ్డి , మున్సిపల్ కౌన్సిలర్లు స్థానిక ప్రజాప్రతినిధులు, వైశ్య సంఘాల నాయకులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. భక్తి భావంతో జరిగిన ఈ వేడుకలు పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పాయి.

Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >
Image 1

100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు

Posted On 2026-09-04 12:11:03

Readmore >
Image 1

హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్

Posted On 2026-09-04 12:09:51

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు

Posted On 2026-09-04 08:53:55

Readmore >