| Daily భారత్
Logo




శ్రీరాముడిచే నిర్మించిన రామసేతు

News

Posted on 2024-07-15 09:16:09

Share: Share


శ్రీరాముడిచే నిర్మించిన రామసేతు

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: కవి వాల్మీకి వ్రాసిన రామాయణం ప్రకారం రావణుడు సీతను అపహరించడంతో ఆమెను రక్షించడానికి రాముడు లంకకు వెళ్లే క్రమంలో తన వానర సైన్యంతో కలిసి రాళ్లతో ఈ వంతెనను నిర్మించారు.

 ఈ వారధిని పలురకాల చెట్ల కాండాలతోను, రాళ్ళతోను  వానరులసహాయంతో లంకకు వారధి నిర్మించడం, రావణుని సంహరించడం జరిగింది. 

కనుక రాముడే ఈ వారధిని నిర్మించాడని, అందుకే దీనిని రామసేతు అంటారని హిందువుల నమ్మకం.

ఈ వారధి ప్రాంతంలో సముద్రంలో ఆటుపోట్లు అత్యంత తీవ్ర స్థాయిలో ఉంటాయి.

2004 సునామీ సమయంలో రామసేతు నిర్మాణంలో ఉన్న కొన్ని రాళ్లు రామేశ్వరం ప్రాంతంలో కనిపించాయని చెబుతుంటారు.

ఇప్పటికీ ఆ ప్రాంతంలో నీటిపై తేలే రాళ్లు కనిపిస్తాయి. వాటిని చూడటానికి చాలా మంది రామేశ్వరం వెళతుంటారు.

శాటిలైట్లు తీసిన ఛాయాచిత్రాలలో 30 మైళ్ల పొడవున రాళ్లు పేర్చి ఉన్నట్లుగా కనిపిస్తుందని

రామసేతు అనేది దక్షిణ భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలో ఒక భాగమైన రామేశ్వరం (పంబన్) ద్వీపానికి, శ్రీలంక దేశానికి చెందిన మన్నర్  ద్వీపానికి మధ్య ఉన్న ఇసుక దిబ్బల శ్రేణి ఈ దిబ్బ ముఖ్యంగా ఇసుక, సున్నపు రాళ్ళను కలిగియుంటుంది. 

హిందూ మహాసముద్రంలో కొన్ని చోట్ల సుమారు 1.2 మీటర్ల లోతులో మునిగియుండే ఈ ఇసుక దిబ్బ పొడవు 18 మైళ్ళు (అనగా 30 కిలోమీటర్లు). ఈస్ట్ ఇండియా కంపెనీ వారు రామసేతు ను ఆడం బ్రిడ్జి(Adams Bridge) అని భ్రమ కలిగించారు,

 అలా అయిన భారత దేశం చరిత్ర ని ఇంకా మన పురాణ పురుషుల మనుగడ ను చెరిపి వేయాలి అని కుటిల నీచమైన ఆలోచన చేశారు.[ఆధారం చూపాలి]రామాయణ ఇతిహాసం అబద్దం అని ప్రచారం చేయటానికి ఈ వంతెన కి అడం బ్రిడ్జి అని పేరు పెట్టారు.

[ఆధారం చూపాలి]1788 సం, ఆసమయం లో ఆస్ట్రేలియాకు చెందిన బోటనికల్ ఎక్స్ప్లోరర్ జోసెఫ్ పార్క్ అన్వేషణ ల ఆధారంగా, ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన మొదటి సర్వేయార్ జనరల్ జేమ్స్ రెనలే ఒక మ్యాప్ గీశాడు దీనిని మ్యాప్ ఆఫ్ హిందుస్తాన్ లేదా మ్యాప్ ఆఫ్ మొఘల్ ఎంపైర్ అనేవాళ్ళు.

ఇదొక సూపర్ హ్యూమన్ అచీవ్‌మెంట్

2017 డిసెంబర్‌లో అమెరికాకు చెందిన సైన్స్ ఛానెల్... 30 మైళ్లకు పైగా పొడవున్న రామసేతు మానవ నిర్మితమని ప్రకటించడం ద్వారా మరోసారి చర్చకు తెరలేపింది.

రామసేతు సహజసిద్ధంగా ఏర్పడినట్టు లేదని, అక్కడి ఇసుక సహజంగా ఉన్నదే అయినా దానిపై పేర్చిన రాళ్లు మాత్రం వేరే చోటు నుంచి తీసుకొచ్చి పేర్చినట్టుగా ఉన్నాయని పురాతత్వ శాఖకు చెందిన డాక్టర్ అలెన్ లెస్టర్ అన్నారు.

ఇసుక 4వేల ఏళ్ల నాటిదని , రాళ్లు 7 వేల ఏళ్ల నాటివని పరిశోధనలలో తేలిందని చెప్పారు.

సింపుల్‌గా చెప్పాలంటే దీనిని సూపర్ హ్యూమన్ అచీవ్‌మెంట్ అని చెప్పింది సైన్స్ ఛానెల్.

మరి వాటిని ఎవరు అక్కడికి తీసుకొచ్చి పేర్చి ఉంటారు? ఆ రాళ్ల వెనకున్న కథేంటి? అనేవి మాత్రం మిస్టరీనే.

రాజకీయ వివాదంగా రామసేతు

రామసేతు రాజకీయంగా కూడా కొన్నేళ్లు బాగా రగిలిన అంశమే.

2005లో యూపీఏ ప్రభుత్వం సేతు సముద్రం షిప్ కెనాల్ ప్రాజెక్టులో భాగంగా 12 మీటర్ల లోతు, 300 మీటర్ల వెడల్పు ఉన్న కాలువను తవ్వేందుకు అనుమతి ఇచ్చింది.

గల్ఫ్ ఆఫ్ మన్నార్‌ను లోతుగా తవ్వి నౌకల రాకపోకలకు అనువుగా మార్చాలనేది నాటి యూపీఏ సర్కారు ఉద్దేశం.

ఈ ప్రాజెక్ట్ అరేబియా సముద్రం, బంగాళాఖాతం మధ్య ప్రయాణించడానికి ఓ మార్గం ఏర్పరుస్తుంది.

దీంతో శ్రీలంక చట్టూ తిరిగే శ్రమ తగ్గడంతో పాటు ప్రయాణ సమయం, ధనం ఆదా అవుతాయని భావించింది.

కానీ ఈ మార్గం ఏర్పడాలంటే రామసేతును బద్దలు కొట్టాల్సి వస్తుండటంతో దీనిపై హిందూ సంస్థలు వ్యతిరేకించాయి.

భారత్, శ్రీలంకకు చెందిన పర్యావరణ వేత్తలు కూడా సముద్ర పర్యావరణం దెబ్బ తింటుందని ఆందోళన వ్యక్తం చేశారు

 సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న వివాదం

ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మద్రాస్ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది.

రామాయణంలో పేర్కొన్న విషయాలకు ఎలాంటి శాస్త్రీయమైన ప్రాతిపదిక లేదని కాంగ్రెస్ తన పిటిషన్‌లో పేర్కొనడంతో కేసు సుప్రీంకోర్టు మెట్లెక్కింది.

పురావస్తుశాఖ కూడా కాంగ్రెస్ వాదననే బలపరిచింది. అప్పటి నుంచి ఈ వివాదం సుప్రీం కోర్టులోనే ఉంది.

తర్వాత 2018లో కేంద్రం ప్రాజెక్టు కోసం రామసేతును ముట్టుకోబోమని సుప్రీం కోర్టుకు చెప్పింది.

మరోవైపు దీనిని వారసత్వ కట్టడంగా గుర్తించాలని మాజీ బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.

ఏదేమైనా విజ్జానానికి , విశ్వాసాలకు మధ్య జరిగే నిరంతర సంఘర్షణలో రామ సేతు ఇప్పటికీ కొరకరాని కొయ్యగానే ఉంది.

Image 1

ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!

Posted On 2026-09-03 09:31:35

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా

Posted On 2026-09-03 09:21:29

Readmore >
Image 1

భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

Posted On 2026-09-03 07:53:15

Readmore >
Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >