Posted on 2024-07-13 13:59:16
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: మానసిక సమస్యలు, మత్తు పదార్థాలు,ఆత్మహత్యల నిరోధంపై గత 15 సంవత్సరాలుగా రాష్ట్ర స్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రముఖ సైకాలజిస్ట్ పున్నంచందర్ కనుకుంట్లకు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఇన్స్పైరింగ్ సైకాలజిస్ట్ అవార్డు ను ఈరోజు హైదరాబాద్ లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో మాజీ మంత్రి త్రిపురాన వెంకటరత్నం, మాజీ కేంద్ర మంత్రి ఎస్. వేణుగోపాల చారి, యాక్టర్ కే. వి . ప్రదీప్ చేతుల మీదుగా ప్రదానం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా టీ.పి.ఏ. రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మోత్కూరు రాంచందర్ మాట్లాడుతు సైకాలజీ రంగంలో ఎన్నో అద్భుత ప్రయోగాలు చేస్తు విభిన్నమైన పద్ధతులతో నిర్జీవమైన సమాజంలో అనునిత్యం ప్రేరణ నింపుతున్న పున్నంచందర్ కు అవార్డు ప్రకటించడం గర్వకారణంగా నిలుస్తుందని అన్నారు.
ఆత్మహత్యల నిరోధం పై తాను చేస్తున్న కృషి దేశ వ్యాప్తంగా అనుసరణీయంగా ఉందని అన్నారు.
మానసిక సమస్యల నివారణలో అనుసరిస్తున్న పద్ధతులు అద్భుత విజయాలను అందిస్తున్నాయని కొనియాడారు.
ఈ సందర్భంగా పలువురు వక్తలు పున్నంచందర్ ను అభినందించారు.
అవార్డు రావడం పట్ల పున్నంచందర్ ను సైకాలజిస్ట్ అలువాల ఈశ్వర్, అడేపు వేణు, అయ్యప్ప రాము, ఎలగొండ ఆంజనేయులు జె.ఏస్..అరవింద్, వాసాల హరిప్రసాద్ గారు అభినందించారు
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >
ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా
Posted On 2026-09-03 09:21:29
Readmore >
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >