| Daily భారత్
Logo




మార్చురీ వాహనాలకు అడ్డాగా మానుకోట ప్రెస్ క్లబ్ -- మూతబడ్డ ప్రెస్ క్లబ్

News

Posted on 2024-07-13 14:04:12

Share: Share


మార్చురీ వాహనాలకు అడ్డాగా మానుకోట ప్రెస్ క్లబ్ -- మూతబడ్డ ప్రెస్ క్లబ్

ప్రారంభోత్సవానికి ఎదురు చూస్తున్న జర్నలిస్టులు? 

ఇండ్ల మహేష్ జర్నలిస్ట్

డైలీ భారత్, మహబూబాబాద్: మహబూబాబాద్ పట్టణం లోని ప్రెస్ క్లబ్ నిరుపయోగంగా మూతపడి ఉండడంతో ప్రారంభోత్సవం కొరకు ఎదురు చూస్తున్న జర్నలిస్టులు ...?

మహబూబాబాద్ లోని సీనియర్ జర్నలిస్టులు ముందు చూపుతో జర్నలిస్టుల భవిష్యత్తు నూ దృష్టిలో ఉంచుకొని , ప్రెస్ క్లబ్ అడ్డాగా వార్తల సేకరణ, కార్యచరణను ప్రారంభించుటకు ఎంతగానో శ్రమించి , స్థలాన్ని ఏర్పరచుకొని , ప్రెస్ క్లబ్ ను నిర్మించడం జరిగింది.

మహబూబాబాద్ నూతనంగా జిల్లాగా ఏర్పడిన, గతంలో సీనియర్ జర్నలిస్టులు నిర్మించిన మహబూబాబాద్ జిల్లా ప్రెస్ క్లబ్  ఎక్కడి గొంగళి అక్కడే అనే మాదిరిగా, కార్యాచరణను ప్రారంభించే నేటి తరం (జర్నలిస్ట్ లు) వేరు , వేరు యూనియన్ల లొ ఉన్నత పదవులను అలంకరించిన యూనియన్ పెద్దలు వారి యొక్క స్థానాన్ని పదిల పరుచు కునేందుకు, కుంటి సాకులతో కాలాన్ని గడుపుతూ, ప్రెస్ క్లబ్ సమస్యను పట్టించుకునే పెద్ద మనుషులే కరువయ్యారు.

మహబూబాబాద్ జిల్లాలోని  మండలలలో స్థానిక జర్నలిస్టులు ప్రెస్ క్లబ్ల్లు  ఏర్పాట్లకు, జిల్లాలోని స్థానిక యూనియన్ల పెద్దలను ఆహ్వానించి వారి చేతుల మీదిగానే ప్రారంభోత్సవాలు జరుపుతున్న, మహబూబాబాద్ నూతన జిల్లాగా ఏర్పడి సుమారుగా 8 సంవత్సరముల కాలం గడుస్తున్నను, యూనియన్ల కు అతీతంగా , జిల్లా ప్రెస్ క్లబ్ కొరకు యూనియన్ల ఐక్యత లోపంతో మహబూబాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ ను పట్టించుకునే నాధుడు లేక  ప్రెస్ క్లబ్ భవనం మూగబోయింది. 

అన్ని రంగాలలో యువత ముందుకు రావాలని పదేపదే పెద్దలు ఆశాభావం వ్యక్త పరుస్తున్న నేటి తరంలో జర్నలిజం అనే మక్కువతో నేడు యువత విలేకరులుగా ముందుకు వస్తూ జర్నలిజంలో కొనసాగు తుండగా, నూతనంగా విచ్చేసిన జూనియర్  విలేకర్ల్లకు  సీనియర్లు వారి యొక్క అనుభవాన్ని తెలియపరిచి సమాజం యొక్క సమస్యల పరిష్కారానికి , ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా జర్నలిస్టులు ఉండేలా సీనియర్ జర్నలిస్టులు , తమ అనుభవాన్ని జర్నలిజం మీద మక్కువతో ఈ వృత్తిలోకి వస్తున్న యువతకు దిశా, నిర్దేశం సీనియర్ జర్నలిస్టు మాత్రమే చేయగలరు.

మహబూబాబాద్ పట్టణంలోని జర్నలిస్టు యూనియన్ లు అనేకం ఉండడంతో, అ ఆ యూనియన్ల ఉన్నత పదవులను అలంకరించిన పెద్దల మధ్య ఐక్యత లోపంతో , మహబూబాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ యధావిధిగా కొనసాగించ కుండా,  ఉన్న ప్రెస్ క్లబ్ నూతన బిల్డింగ్ నిర్మాణం కొరకు ఆలోచన చేస్తూ నిధుల కొరకు  గత ప్రభుత్వ హయాంలో మానుకోట ఎం ఎల్ ఏ శంకర్ నాయక్, మంత్రి సత్యవతి రాథోడ్, ఎం ఎల్సీ తక్కేలపల్లి రవీందర్ రావు, మాజీ ఎంపీ కవిత, మిగతా రాజకీయ నాయకులను ప్రెస్ క్లబ్ నిర్మాణానికి అవసరమైన నిధులు (విడుదల) ఇవ్వమని కోరగా, చేస్తామని హామీ కూడా ఇవ్వడం జరిగింది. ప్రెస్ క్లబ్ నూతన బిల్డింగ్ నిర్మాణం కొరకు కొంతమంది దాతలు ముందుకు వచ్చి సహకరిస్తాం అని చెప్పి నటువంటి హామీని  ఐక్యత లోపంతో కోల్పోయాం. ప్రస్తుతం ప్రెస్ క్లబ్ స్థలం  ఇరు వైపులా  గవర్నమెంట్ హాస్పిటల్ అంబులెన్స్, మార్చురీ వాహనాలు , ప్రభుత్వ ఆసుపత్రి కి వచ్చే రోగుల  వాహనాలు సైతం ప్రెస్ క్లబ్ ప్రాంగణంలోనే ఇష్టాను సారంగా  నిలుపుతూ, అసంఘటిత  కార్యక్రమాలకు అడ్డగా మారుతున్నందున, ప్రతి ఒక్క జర్నలిస్ట్ ప్రెస్ క్లబ్ అభివృద్ధి కొరకు ఐక్యతతో  ముందుకు రండి.

ప్రెస్ క్లబ్ బాధ్యతలు స్వీకరించుటకు అన్ని యూనియన్ల నుండి నాయకత్వం కొరకు  పోటాపోటీ కచ్చితంగా ఉంటుంది. నిజంగా జర్నలిస్టుల మేలు కోరుకునే నాయకులు మీరే అయితే మహబూబాబాద్  పట్టణంలోని ప్రస్తుతం ఉన్న ప్రెస్ క్లబ్ ను యధావిధిగా ముందు ప్రారంభం చేసుకుని, డబ్బులు సమకూర్చు కున్న తర్వాత నూతన భవనం గురించి ఆలోచన చేసు కునేందుకు సహకరిస్తారు. మానుకోట ప్రెస్ క్లబ్ పునః ప్రారంభం దిశగా యూనియన్ల బాధ్యులు మొదట తాత్కాలిక మైన కమిటీని వేసి, ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా ఎన్నిక నిర్వహించి, సభ్యత్వాలను ఇస్తూ, జర్నలిస్టులకు అండగా ఉంటూ, ప్రెస్ క్లబ్ పూర్వ వైభవాన్ని తీసుకు వచ్చేందుకు గాను కృషి చేస్తారని ఆశిస్తూ, ఆశా భావం వ్యక్త పరుస్తున్న మహబూబాబాద్ జర్నలిస్టులు.

Image 1

ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!

Posted On 2026-09-03 09:31:35

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా

Posted On 2026-09-03 09:21:29

Readmore >
Image 1

భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

Posted On 2026-09-03 07:53:15

Readmore >
Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >