| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కామారెడ్డిలో చెన్నై, కిసాన్ షాపింగ్ మాల్స్ ప్రారంభం...

కామారెడ్డిలో చెన్నై, కిసాన్ షాపింగ్ మాల్స్ ప్రారంభం...

విశిష్ట అతిథిగా హాజరైన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలోని నిజాంసాగర్ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన చెన్నై షాపింగ్ మాల్ మరియు కిసాన్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమాలు శుక్రవారం ఘనంగా జరిగాయి.

తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ విశిష్ట అతిథిగా హాజరై మాల్స్‌ను లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ కామారెడ్డి పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కొత్త వాణిజ్య సంస్థలు, షాపింగ్ మాల్స్ ఏర్పాటు కావడం శుభపరిణామమన్నారు. స్థానిక ప్రజలకు నాణ్యమైన వస్తువులు అందుబాటులోకి రావడంతో పాటు వాణిజ్య కార్యకలాపాలు విస్తరిస్తాయని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. యాజమాన్యాలకు అభినందనలు తెలిపి సరసమైన ధరలకు నాణ్యమైన ఉత్పత్తులు అందించాలని ఆకాంక్షించారు.

పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని చెప్పారు.


ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి, మాజీ డీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఐరేని సందీప్ కుమార్, పీఏసీఎస్ చైర్మన్ గూడెం శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Previous ప్రభుత్వ స్కూళ్లలో బ్రేక్‌ఫాస్ట్ పథకానికి CSR సాయం...
Next దిల్‌సుఖ్‌నగర్ సంతోషిమాత ఆలయంలో ఉద్రిక్తత... విగ్రహంపై దాడికి యత్నించిన నిందితుడు అరెస్ట్
ADVERTISEMENT