| Daily భారత్
Logo




చౌడమ్మగుట్ట శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా పల్లకీ సేవ

News

Posted on 2024-07-13 13:50:58

Share: Share


చౌడమ్మగుట్ట శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా పల్లకీ సేవ

భక్తులకు అన్నదానం చేసిన రామశేఖర్ రెడ్డి, శివ కుమారి దంపతులు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపాలిటి పరిధిలోని సోలిపూర్ చౌడమ్మగుట్ట శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో శనివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భజన భక్త బృందం సభ్యుల ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. శ్రీ ఆంజనేయస్వామి విగ్రహాన్ని పల్లకిలో మోస్తూ శ్రీరామ జయరామ, జయ జయ రామ నినాదాలతో ఆట పాటలతో, భజనలతో భక్తులు పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించారు. భక్తి పాటలు భజనలతో ఆలయంలో శ్రీరామ నామ స్మరణ మార్మోగింది. ఆలయ ప్రధాన అర్చకులు రఘుపతి శర్మ, రాఘవేంద్ర చార్య, అర్చకులు కృష్ణ, ప్రమోద్, సునీల్ పంతులు భక్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం దేవాలయానికి వచ్చిన భక్తులకు పట్టణంలోని న్యూ రాఘవేంద్ర కాలనీకి చెందిన ఎస్. రామశేఖర్ రెడ్డి, శివ కుమారి దంపతులు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదానం చేసిన రామశేఖర్ రెడ్డి శివకుమారి దంపతులకు దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో కృతజ్ఞతలు తెలిపి పూలమాలతో సన్మానించారు. దేవాలయ అభివృద్ధికి, అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు అభివృద్ధి కమిటీ సభ్యులు శ్రీశైలం గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పులిమామిడి శ్రీశైలం గౌడ్, వసంతరావు, అన్నారం రఘు గౌడ్, గడ్డమీద రమేష్ ముదిరాజ్, రఘునందన్ రెడ్డి, లక్ష్మణ్, బచ్చన్న, కిషన్ నాయక్, రాఘవేందర్, సుప్ప నర్సింలు, శ్రీనివాస్, నారాయణ, వీర్లపల్లి కృష్ణయ్య, లక్ష్మికాంత్ రెడ్డి, కృష్ణ చారి, శంకర్ గౌడ్, యాదగిరి, పి.ప్రవీణ్ గౌడ్, పద్మా వెంకటేష్, గోరియా నాయక్, కొత్త సత్తయ్య గౌడ్, శ్రీనివాస్, రమేష్, సుధాకర్ రెడ్డి, హనుమంత్ రెడ్డి, రవీందర్, మాజీ వార్డు సభ్యులు సింగపాగ లక్ష్మయ్య, భజన భక్త బృందం, మహిళలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..

Image 1

ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!

Posted On 2026-09-03 09:31:35

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా

Posted On 2026-09-03 09:21:29

Readmore >
Image 1

భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

Posted On 2026-09-03 07:53:15

Readmore >
Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >