Posted on 2024-07-12 13:29:08
సమస్యలపై దృష్టి సారించండి
మున్సిపల్ శాఖకు షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్" ఆదేశం
పారిశుద్ద్య కార్మికుల సంఖ్య పెంచాలని సూచన
వీధిలైట్ల సమస్యలను పరిష్కరించాలి
మిషన్ భగీరథ సమస్యలపై వెంటనే స్పందించండి
అన్ని వార్డుల్లో సీసీ కెమెరాల ఆవశ్యకతపై పరిశీలించండి
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా:షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న అనేక సమస్యలపై అధికారులు స్థానిక ప్రజాప్రతితులు సిబ్బంది వెంటనే దృష్టి సారించాలని స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆదేశించారు.
శుక్రవారం స్థానిక మున్సిపల్ కమిషనర్ చీమ వెంకన్న పర్యవేక్షణలో మున్సిపల్ చైర్మన్ కే. నరేందర్ సభ అధ్యక్షతన జరిగిన మున్సిపల్ సర్వసభ్య సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి తదితర కౌన్సిలర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. పారిశుద్ధ్య కార్మికుల సంఖ్యను పెంచాలని, పట్టణంలోని అన్ని వార్డులలో ప్రతిరోజు పారిశుద్ధ కార్యక్రమాలు జరిగేటట్టుగా చూడాలని సభ్యులు కోరడం జరిగిందని తెలిపారు.
పురపాలక సంఘంలో చాలా ప్రదేశాలలో విద్యుత్ దీపాల సమస్యలు ఉన్నాయని, పాడైపోయిన లైటులను వెంటనే మరమ్మతు చేయించాలని కోరడం జరిగిందన్నారు. పట్టణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం కోసమై గతంలో తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే అమలు చేసి అన్ని వార్డులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సభ్యులు కోరడం జరిగింది. మిషన్ భగీరథ నేటి విషయంలో చాలా చోట్లలో సమస్యలు ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలని సభ్యులు కోరడం జరిగింది. పురపాలక సంఘంలోని చాలా ప్రాంతాలలో హైమాస్ లైట్లు వెలగడం లేదని సభ్యులు సభ దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. పారిశుద్ధ కార్మికుల ఉద్యోగానికి భద్రత కల్పించాలని వారికి ఆరోగ్య భీమా కల్పించాలని, పట్టణంలోని అన్ని వార్డులలో కుక్కల సమస్య చాలా తీవ్రంగా ఉందని సభలోని అందరి సభ్యులు అభిప్రాయపడ్డారు. వీటి నిర్మూలనకు తగిన చర్యలు చేపట్టాలని, పురపాలక సంఘంలో విలీనమైన పరిసర గ్రామాలపై ప్రత్యేక దృష్టిని సహకరించి వాటి అభివృద్ధిపై ప్రత్యేక నిధులను కేటాయించాలని సభ్యులు సమదృష్టికి తెచ్చినట్టు పేర్కొన్నారు. పట్టణంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికై ప్రత్యేక నిధులను కేటాయించే ప్రభుత్వంతో చర్చించి పట్టణాన్ని అభివృద్ధి పరచాలని సభ్యులందరూ ఎమ్మెల్యే దృష్టికి తీసుకు రావడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నటరాజ్ కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు అధికారులు తదితరులు పాల్గొన్నారు..
ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రచ్చ...అధికారిపై చర్యలు తీసుకోవాలంటున్న బూర బాలమల్లు
Posted On 2026-09-04 03:56:31
Readmore >
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >
ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా
Posted On 2026-09-03 09:21:29
Readmore >
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >