Posted on 2024-07-12 11:12:40
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి ప్రభుత్వం ఒక్కొక్క అడుగు వేస్తోంది. సూపర్ సిక్స్ హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తోంది. ఇప్పటికే జూలై నెల నుంచి పెంచిన పెన్షన్లను అందించే కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టింది. మరోవైపు.. ఇటీవలె ఉచిత ఇసుక పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది. ఇక చంద్రబాబు గెలిచినప్పటినుంచి ఆంధ్రప్రదేశ్‌లోని మహిళలు ఎదురుచూస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఈ మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేసేందుకు దాదాపుగా ముహూర్తం ఖరారు అయినట్లే తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన ఒక్కటే వెలువడాల్సి ఉందని సమాచారం.
ఆగస్టు 15 వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో మూతపడిన అన్నా క్యాంటీన్లను ఆగస్టు 15 వ తేదీన ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఈ మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని కూడా అదే రోజు మొదలుపెట్టాలని సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పథకం అమలుకు సంబంధంచి తుది కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 16 వ తేదీన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఈ పథకం అమలుకు నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్నీ అనుకూలిస్తే ఆగస్టు 15 వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. విశాఖలో ఈ పథకం ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇక ఏపీలో ఉచిత బస్సు పథకం అమలుకు సంబంధించి ఇప్పటికే కసరత్తు కొనసాగుతోంది. పొరుగున ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలు అవుతున్న ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకానికి సంబంధించి.. ఈ పథకం అమలు తీరు పైన ఆర్టీసీ అధికారుల నుంచి ప్రభుత్వం నివేదికలు కోరింది. నిత్యం ఎంతమంది మహిళలు బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు.. ఈ పథకం అమలు చేస్తే ప్రభుత్వ ఖజానాపై ఎంత మేర భారం పడుతుంది.. ఈ ఉచిత బస్సు అమలులో ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి.. ఆర్థికంగా తీసుకోవాల్సిన చర్యల పైనా పూర్తి స్థాయిలో అధికారులు నివేదికలు సిద్ధం చేశారు.
ఇక ఏ కేటగిరీ బస్సుల్లో మహిళలకు ఈ ఉచిత ప్రయాణాన్ని కల్పించాలనే దానిపైనా అధికారులు తుది కసరత్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని రూట్లలో ఈ ఉచిత బస్సు పథకం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఉన్న బస్సులతో ఈ పథకం అమలు చేస్తే.. సాధారణ ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవని అధికారులు పేర్కొంటున్నారు. కొత్త బస్సులు కొనుగోలు చేసే వరకు ఈ పథకాన్ని వాయిదా వేయాలనే సూచనలు వస్తున్నా.. ప్రభుత్వం మాత్రం అమలు వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది
ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రచ్చ...అధికారిపై చర్యలు తీసుకోవాలంటున్న బూర బాలమల్లు
Posted On 2026-09-04 03:56:31
Readmore >
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >
ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా
Posted On 2026-09-03 09:21:29
Readmore >
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >