| Daily భారత్
Logo




బీఆర్ఎస్ పాలనలో స్థానిక ప్రజా ప్రతినిధుల పనితీరు ఆదర్శనీయం : ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి

News

Posted on 2024-07-08 15:32:28

Share: Share


బీఆర్ఎస్ పాలనలో స్థానిక ప్రజా ప్రతినిధుల పనితీరు ఆదర్శనీయం : ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి

బీఆర్ఎస్  ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్

సన్మాన కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: బీఆర్ఎస్ పార్టీకి చెందిన  స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పదవి ముగిసిన సందర్భంగా షాద్ నగర్ పట్టణం కింగ్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సన్మాన సభ కార్యక్రమంలో పాల్గొన్న మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ  నవీన్ కుమార్ రెడ్డితో కలిసి షాద్ నగర్ మాజీ ఎంఎల్ఏ అంజయ్య యాదవ్ పాల్గొని మాట్లాడారు కాంగ్రెస్ పార్టీకి  అబద్ధాలు చెప్పడం  సర్వసాధారణమైనవి అని, గత రాజకీయ చరిత్ర కూడా ఇదే విషయాలను చెప్తాయని  అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ నాయకులు  భయపడవలసిన అవసరం లేదని, ప్రజా సమస్యలపై  నిత్యం ప్రజల్లో ఉండాలని కోరారు. ఏ కార్యకర్తకైనా  అన్యాయం జరిగితే, మనమందరం సమిష్టిగా  కార్యకర్తల పక్షాన నిలువాలని చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా పని చేశారే తప్పా, కార్యకర్తలను పట్టించుకోవడంలేదని విమర్శలు చేయడం సరికాదని అన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వారి వారి గ్రామాలు,మండలాల  అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడ్డారని, ఎన్నో నిధులను వెచ్చించి స్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాలు, హరితహారం, పారిశుద్ధ్యం, సిసి రోడ్లు, అంతర్గత మురుగు కాలువలు, కమ్యూనిటీ భవనాలు ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల గుండెల్లో చెరుగని ముద్ర వేసుకున్నారని కొనియాడా రు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్లు, రెండువేల పింఛన్లు, గురుకుల పాఠశాలల ఏర్పాటు  వంటి సంక్షేమ పథకాల అమల్లో మీరు కూడా భాగస్వాములు కావడం మనందరికీ గర్వకారణం అని చెప్పారు. వెనుకబడిన తెలంగాణను అన్ని రంగాలలో అగ్రగామిగా నిలిపి, దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా  తెలంగాణను నిలిపిన  ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని, ఆయన స్ఫూర్తితో  మనమందరం రానున్న రోజుల్లో ప్రజాసేవలో భాగస్వాములు కావాలని కోరారు. ఇందులో భాగంగానే  షాద్ నగర్ నియోజక వర్గంలోని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపిటిసిలను, మాజీ జడ్పిటిసిలను, మాజీ సర్పంచులను శాలువాలు, పూల మాలలతో  ఘనంగా సన్మానించారు.

Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >
Image 1

100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు

Posted On 2026-09-04 12:11:03

Readmore >
Image 1

హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్

Posted On 2026-09-04 12:09:51

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు

Posted On 2026-09-04 08:53:55

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రచ్చ...అధికారిపై చర్యలు తీసుకోవాలంటున్న బూర బాలమల్లు

Posted On 2026-09-04 03:56:31

Readmore >
Image 1

ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!

Posted On 2026-09-03 09:31:35

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా

Posted On 2026-09-03 09:21:29

Readmore >
Image 1

భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

Posted On 2026-09-03 07:53:15

Readmore >