| Daily భారత్
Logo




యువ ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్న మంత్రి కేటీఆర్

News

Posted on 2023-10-27 12:58:51

Share: Share


యువ ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్న మంత్రి కేటీఆర్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి ఏ క్షణంలోనైనా జైలుకు వెళ్లడం ఖాయమని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం బిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యువ ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో అడ్డగోలుగా డబ్బులు పంచితే రేవంత్ రెడ్డిపై ఓటుకు నోటు కేసు నమోదైందని, రేవంత్ రెడ్డి ఏ క్షణంలోనైనా జైలుకు వెళ్లవచ్చునని, కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ లేకుండా పోతుందని జోష్యం చెప్పారు. 150 ఏండ్ల క్రింద కాంగ్రెస్ పార్టీ పుట్టిందని, స్వాతంత్య్రం వచ్చిక మహాత్మా గాంధీ పార్టీని తిసివేయమని చెప్పాడన్నారు. 1968 ఆంధ్రకు, తెలంగాణకు పెండ్లి చేసింది కాంగ్రెస్ పార్టీయేనని, ఇంద్రరాగాంధీ హయాంలో రెండవ సారి తెలంగాణను బొంద పెట్టిందన్నారు. 2014లో దిక్కులేక కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని, 55 ఎండ్లు అధికారం వెలగబెట్టి రాష్ట్రానికి ఏం కూడా చేయాలేదన్నారు. 2014లో మోడీ జెన్ దన్ యోజన ఖాతాలు తీస్తే దన్ దన్ 15 లక్షలు ఖాతాల్లో వేస్తానని చెప్పి ఇప్పడి వరకు వేయలేదన్నారు. మాట్లాడితే ఈరోజు ఏ వారం అన్న అని అడుగుతూ బండి సంజయ్ వారాల అబ్బాయిగా మారాడన్నారు. మాట మాటకి దేవుడు అన్న మోడీ అంటాడని, పెట్రోల్ ,గ్యాస్ ధరలు పెంచినందుకా, ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వనందుకా దేనికి మోడీ దేవుడో చెప్పాలన్నారు. ఒకే వందే భారత్ రైలుకు వంద సార్లు జండా ఉపిండని, సిరిసిల్ల కు ఒక్క పవర్ లూం క్లస్టర్ అడిగితే ఇవ్వలేదని, కనీసం బండి సంజయ్ ప్రయత్నం కూడా చేయలేదని ఎద్దేవా చేశారు. విజన్ ఉన్న నాయకుడు ఒక్కడన్న ప్రతిపక్షంలో ఉన్నాడా అని ప్రశ్నించారు.కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో గోడలమీద నేతన్నలు ఆత్మహత్యలు మాణాలని అధికారులు రాశారని, ఒకనాడు సిరిసిల్ల ఉరిసిల్లగా ఉండే, నేడు సిరిశాలగా మారిన మాట వాస్తవం కాదా తేలుసుకోవాలన్నారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలు పైసలు పంచాలని చూస్తున్నాయని, తాను మాత్రం ఎన్నికల్లో పైసలు ,మందు పంచనని స్పష్టం చేశారు. సిరిసిల్ల దయతో తనకంటూ ఒక గుర్తింపు వచ్చిందని, సిరిసిల్ల రుణం తీర్చు కుంటానన్నారు. కలలో కూడా సిరిసిల్ల ఇంతలా అభివృద్ధి చెందుతుందని ఎవ్వరూ అనుకోలేదని, ఇన్ని కళాశాలలు వస్తాయని ఎవ్వరూ అనుకోలేదన్నారు. అంత సిరిసిల్లాకేన అని అక్కడి కాంగ్రెస్ నేతలు  అసూయపడుతుంటే, ఇక్కడి కాంగ్రెస్ నేతలు అభివృద్దే జరగలేదని అంటున్ననారన్నారు. పాయలాగా ఉన్న మానేరూ వాగు 365 నీళ్ళు ఉంటున్నాయని, సజీవ జలదర మాదిరిగా మార్చింది కెసీఆర్ ప్రభుత్వం కాదా అని గుర్తు చేశారు. వర్కర్ టూ ఓనర్ దేశంలో ఎక్కడ లేదని, 400 కోట్లతో వర్కర్ టూ ఓనర్ షెడ్లు కడుతున్నామని, 375 ఎకరాల్లో అక్వహబ్ ఏర్పాటు కాబోతుందని చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు తెస్తున్నామని, అభివృద్ధి, సంక్షేమంలో సిరిసిల్ల గణనీయంగా మారిందన్నారు.నాది సిరిసిల్ల అని గర్వంగా చెప్పుకుంటున్నానని అన్నారు. ఎన్నికలు రాగానే ఓట్లు దండుకొచడానికి కులం, మతం ముందుకు వస్తారని, అభివృద్దే తన కులం సంక్షేమమే తన మతమని తెలిపారు. పద్నాలుగున్నర సంవత్సరాల తన ఫర్ఫామేశన్ ఏంటో సిరిసిల్ల ప్రజలకు తెలుసని, ఓటు అనే అస్త్రాన్ని బ్రమ్మండగా వాడి మంచి అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఎప్పుడు వచ్చమన్నది కాదు బుల్లెట్టు దిగిందా లేదా అన్న చెందగా ఓట్లు పడాలని సినిమా డైలాగ్ గుర్తు చేశారు. పని చేసిన చేయకపోయినా, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్లు చూపిస్తూ యువతను దారి మళ్లించే పనిలో కాంగ్రెస్, బిజెపి పార్టీలు సోషల్ మీడయాలో ప్రచారం చేస్తున్నారని, 2014 ముందు సిరిసిల్ల ఎట్లా ఉండేదో, ఇప్పుడు ఎట్లా ఉందో పాత ఫోటోలు కొత్త ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయాలని కోరారు. ఈ సమావేశంలో బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, విద్యార్థి విభాగం అధ్యక్షుడు హరీష్, పట్టణ యూత్ అధ్యక్షుడు మనోజ్, ఉపాధ్యక్షుడు సికిందర్, మునిసిపల్ కౌన్సిలర్లు, పెద్ద ఎత్తున యువత పాల్గొన్నారు.

Image 1

ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడికి సన్మానించిన మాజీ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ గుప్తా

Posted On 2026-04-02 16:04:30

Readmore >
Image 1

స్వలాభం కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దు

Posted On 2026-04-02 14:57:47

Readmore >
Image 1

గంజాయి కేసులో ముగ్గురు నిందితులకు 10 ఏళ్ల కఠిన జైలు శిక్ష ... చోడవరం కోర్టు సంచలన తీర్పు

Posted On 2026-04-02 14:47:44

Readmore >
Image 1

హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ : డిసిపి శ్రీ ఎస్. శ్రీనివాస్, ఐపీఎస్

Posted On 2026-04-02 14:43:45

Readmore >
Image 1

హనుమాన్ ర్యాలీ సందర్భంగా మజ్జిగ పంపిణీ

Posted On 2026-04-02 13:46:06

Readmore >
Image 1

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం ఆవేదన

Posted On 2026-04-02 13:44:47

Readmore >
Image 1

వేములవాడ తిప్పాపురం గోశాలలో ఆకస్మిక తనిఖీలు

Posted On 2026-04-02 13:39:34

Readmore >
Image 1

ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షునిగా అమరవాది

Posted On 2026-04-02 12:04:26

Readmore >
Image 1

రోడ్డు ప్రమాద బాదితులను కాపాడితే రహ్ వీర్ పథకం ద్వారా రూ.25 వేల పారితోషికం : జిల్లా ఎస్పీ

Posted On 2026-04-02 11:35:51

Readmore >
Image 1

జంగంపల్లి గ్రామంలో ప్రజా పాలనలో భాగంగా గ్రామసభ

Posted On 2026-04-02 11:29:23

Readmore >