| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

శారీరక ధారుడ్యం, మానసికోల్లాసానికి ఉపకరణ : ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి

శారీరక ధారుడ్యం, మానసికోల్లాసానికి ఉపకరణ : ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి విజేతలకు బహుమతులు అందజేత

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: యువత షటిల్‌ ఆడేందుకు ఆసక్తి చూపుతున్నారనీ శారీరక ధారుడ్యానికి, మానసికోల్లాసానికి ఈ ఆటను ఎంచుకుంటున్నారని యువతకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. 

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని స్టేడియం గ్రౌండ్ లోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన 10వ రాష్ట్ర స్థాయి షటిల్ ‌బ్యాట్మెంటన్ పోటీల ముగింపు కార్యక్రమంలో పాల్గొన ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి మరియు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి, ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు బహుమతులు అందజేయడం జరిగింది.


ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ.. యువత బ్యాడ్మింటన్ పోటీల్లోనూ సత్తా చాటుతున్నారని అన్నారు.  యువకులు నిత్యం షటిల్‌ సాధన చేయడం ద్వారా అనేక లాభాలు ఉన్నాయని పేర్కొన్నారు. సాయంత్రం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు, ఉదయం ఐదు నుంచి ఏడు గంటల వరకు అన్ని వర్గాల వారు వయసుతో సంబంధం లేకుండా బ్యాడ్మింటన్ సాధన చేస్తున్నారని పేర్కొన్నారు.  సింగిల్‌, డబుల్స్‌ విభాగంలో ప్రాక్టీస్‌ చేసుకోవచ్చని, వ్యాయామం కోసం నడక, రన్నింగ్‌ వంటి వాటికి బదులుగా ఎక్కువ శ్రమ కలిగించే షటిల్‌ ఆడుతున్నారని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. అందరూ ఆడే విధంగా సమయం కేటాయించుకుంటూ నిత్యం సాధన చేయడం ద్వారా భవిష్యత్తులో అనేక ఉపయోగాలు ఉన్నాయని పేర్కొన్నారు..

Previous తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుంది - మోతె రాజిరెడ్డి టీఎన్ఎస్ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు
Next తూప్రాన్ పోలీస్ సిఐ రంగాకృష్ణ ను సన్మానించిన జిల్లా కాంగ్రెస్ నాయకులు బుడ్డ భాగ్యరాజ్
ADVERTISEMENT