| Daily భారత్
Logo




పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాల సందర్భంగా మెగా రక్తదాన శిబిరం : జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్

News

Posted on 2023-10-26 20:28:00

Share: Share


పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాల సందర్భంగా మెగా రక్తదాన శిబిరం : జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల జిల్లా: పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాల్లో భాగంగా( ఫ్లాగ్ డే) గురువారం సిరిసిల్ల పట్టణ పరిధిలోని పద్మనాయక ఫంక్షన్ హాల్ లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల, కరీంనగర్, మంచిర్యాల రెడ్ క్రాస్ సొసైటి సహకారంతో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. మెగా రక్తదాన శిబిరానికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ముఖ్య అతిధిగా హాజరై పోలీస్ అధికారులు, రెడ్ క్రాస్ సొసైటీతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరానికి ప్రతి ఒక్కరు రక్తదానం చేసే విధంగా అదనపు ఎస్పీ ఆధ్వర్యంలో డిఎస్పీ లు, సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది, పోలీస్ స్టేషన్ల పరిధిలో గత మూడు రోజుల నుండి ప్రతి గ్రామానికి వెళ్లి అక్కడ అవగాహన కల్పించి ప్రతి ఒక్కరు రక్తదానం చేసే విధంగా అవగాహన నిర్వహించడం జరిగిందన్నారు. విధి నిర్వహణలో కర్తవ్యమే లక్ష్యంగా ప్రాణత్యాగం చేసి అమరులైన పోలీసులను ఈ సమాజం ఎప్పటికీ మరువదని, వారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రజల ధన మాన ప్రాణాలను కాపాడుతూ సంఘవిద్రోహ శక్తుల చేతుల్లో బలైన అమర పోలీసులు వీరులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని చెప్పారు. సమాజ రక్షణ వీరులు నిరంతర ధీరులు ప్రాణాలను కూడా లెక్కచేయని విధి నిర్వహణ రక్షకులు, ప్రకృతి విలయతాండవం చేస్తే అభయమిచ్చి కాపాడే ఆప్తులు నిద్రించే సమాజానికి నిద్రపోని కాపలాగా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. రెగ్యులర్ పోలీసింగ్ తో పాటు ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకునేందుకు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతోమంది  తలసేమియా, సికిల్ సెల్ అనీమియా    మరియు డెంగ్యూ వ్యాధిగ్రస్తులకు రక్తం చాలా అవసరం వారికి సహాయం కోసం అమరవిరుల స్మరకర్ధం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో సుమారు 600 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది,జిల్లాలోని యువకులు, బిఎస్ఎఫ్ సిబ్బంది  పాల్గొని విజయవంతం చేయడం జరిగిందని తెలిపారు. సిరిసిల్ల,కరీంనగర్,మంచిర్యాల జిల్లాల రెడ్ క్రాస్ సొసైటీ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చాలా చక్కగా సహకరించారన్నారు. రక్తదాన శిబిరంలో రక్తదానం చేసేందుకు పెద్ద సంఖ్యలో యువకులు ముందుకు వచ్చి ఉచ్చగంగా పాల్గొనడం అభినందించ దగ్గ విషయమని ఎస్పీ  తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ లు ఉదయ్ రెడ్డి, నాగేంద్రచరి, రవికుమార్, సి.ఐ లు ఉపేందర్, సధన్ కుమార్, శశిధర్ రెడ్డి, కరుణాకర్, కృష్ణకుమార్,కిరణ్ కుమార్, అనిల్ కుమార్, ఎస్.ఐ లు పోలీస్ సిబ్బంది, బిఎస్ఎఫ్ సిబ్బంది, యువకులు, జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అద్యక్షులు గుడ్ల రవి ,వరంగల్ అధ్యక్షులు శ్రీనివాస్ ,కరీంనగర్ అధ్యక్షులు కేశవరెడ్డి, మంచిర్యాల అధ్యక్షులు భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.

Image 1

జీవన రక్ష అవార్డు గ్రహీత డాక్టర్ పల్స హరీష్ గౌడ్

Posted On 2026-07-01 17:29:10

Readmore >
Image 1

దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం

Posted On 2026-07-01 17:28:05

Readmore >
Image 1

మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ దారుణ హత్య

Posted On 2026-07-01 16:22:02

Readmore >
Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >
Image 1

శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ

Posted On 2026-06-30 18:00:06

Readmore >
Image 1

పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-30 17:58:38

Readmore >