Posted on 2024-07-05 12:37:42
పర్యాటక రంగ అధ్యయనానికి కదిలిన ప్రభుత్వ బృందం
ఉమామహేశ్వర ఆలయం, సయ్యద్ నిరంజన్ షా వలి దర్గాలను దర్శించుకున్న మంత్రి ఎమ్మెల్యేలు
పర్యాటక రంగ అధ్యయన బృందంలో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా:ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పర్యాటక కేంద్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అధ్యయన బృందాన్ని ఏర్పాటు చేసింది ఈ సందర్భంగా శుక్రవారం పాలమూరు జిల్లాలోని ఆయా దేవాలయాలు, దర్గాలు ఇతర పర్యాటక స్థలాలను మంత్రులు ఎమ్మెల్యేలు కలిసి దర్శించుకుంటున్నారు.
ఉమామహేశ్వర స్వామి, అచ్చంపేటలోనీ రంగాపూర్ హజ్రత్ సయ్యద్ నిరంజన్ షావలి దర్గాను దర్శించుకున్న రాష్ట్ర మంత్రులు మరియు ఎమ్మెల్యేలు. ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ మరియు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్ మరియు తదితరులు అచ్చంపేట నియోజక వర్గంలోని రంగాపురం ఉమామహేశ్వర స్వామి వారిని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, వైద్య , ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మరియు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు దర్శించుకున్నారు.
ఆలయానికి విచ్చేసిన మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఆలయ అధికారులు, పండితులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేదపండితులు ఆశీర్వదించి.. తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణ రెడ్డి, వాకిటి శ్రీహరి, డా. రాజేష్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, మేఘారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, స్థానిక ఎంపీపీ మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ ప్రకాష్ రెడ్డి, పురావస్తు శాఖ డైరెక్టర్ భారతి హోళిఖేరి, పర్యాటక శాఖ డైరెక్టర్ ఇల త్రిపాఠి, కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్, డి ఎఫ్ ఓ రోహిత్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
హైదరాబాద్‌లో పారిశుధ్య సమస్యలను నివేదించడానికి వాట్సాప్ సౌకర్యం ప్రవేశపెట్టబడింది
Posted On 2026-03-12 21:53:55
Readmore >
శుక్రవారం నాడు అప్పుడే పుట్టిన నవజాత శిశువులకు బేబీ కిట్స్ పంపిణీ కార్యక్రమం
Posted On 2026-03-12 21:52:35
Readmore >
కామారెడ్డిలో ఫ్లయింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలి : కాటిపల్లి వెంకట రమణ రెడ్డి
Posted On 2026-03-12 18:49:30
Readmore >
కామారెడ్డి జిల్లా గురువారం పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-03-12 18:47:14
Readmore >
బిజెపి నుండి గెలిచిన 16 మంది కామారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ ల కు సన్మానం చేసిన బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతరాజు వెంకటేశ్ పెరిక
Posted On 2026-03-12 18:45:43
Readmore >